Salaar Record : యుఎస్ లో సలార్ రికార్డ్ బ్రేక్
విడుదల కాకుండానే సెన్సేషన్
Salaar Record : కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ కు కరెక్ట్ సూటవుతుంది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విషయంలో. మనోడి టేకింగ్, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో యష్ తో తీసిన కేజీఎఫ్ భారతీయ సినిమాను షేక్ చేసింది. అంతేనా బాక్సులు బద్దలు కొట్టింది. మనోడి మేనరిజంతో పాటు నటనకు వంద శాతం మార్కులు పడ్డాయి.
Salaar Record High
ఇక రోజుకో రికార్డు సృష్టిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ప్రశాంత్ నీల్ సలార్. అంచనాలు మరింత పెంచేలా చేస్తూ హీటెక్కిస్తూ దుమ్ము రేపుతున్నాడు దర్శకుడు. ఇక ప్రభాస్ హవా ఓవర్సీస్ లో కూడా ఉందని నిరూపించింది సలార్(Salaar) చిత్రం. ఇప్పటి వరకు ఆయా తెలుగు సినిమాల రికార్డులను బ్రేక్ చేశాడు డార్లింగ్ ప్రభాస్.
ఏకంగా సలార్ అమెరికాలో 1979 ప్రాంతాలలో విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది యుఎస్ లో ఆల్ టైమ్ రికార్డ్ గా నమోదైంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకు సంబంధించి టాప్ లో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ ఉండేది. ఆ చిత్రం 1165 ప్రాంతాల్లో విడుదలైంది. ఇక ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ 776 థియేటర్లలో , పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి 515 ప్రాంతాలలో రిలీజ్ అయింది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట 486 ప్రాంతాలలో విడుదల కాగా బాహుబలి-2 యుఎస్ లో 423 లొకేషన్లలో రిలీజ్ అయ్యింది.
Also Read : Deepika Padukone Project K : కళ్లతో కాటేస్తున్న దీపికా