Jayant Chaudhary : జయంత్ చౌదరికి రాజ్యసభ టికెట్
ప్రకటించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
Jayant Chaudhary : నిన్నటి దాకా సమాజ్ వాది పార్టీ తీవ్ర ఉత్కంఠకు తెర లేపింది. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. యూపీలో సంఖ్యా పరంగా చూస్తే అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీకి 3 సీట్లు వస్తాయి.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కు బయటి నుంచి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. మూడు సీట్లకు గాను రెండు సీట్లను ఖరారు చేసింది. ఇంకొక స్థానానికి సంబంధించి చివరి దాకా సస్పెన్స్ కొనసాగింది.
అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కు రాజ్యసభ సీటు ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. కానీ గురువారం వాటన్నింటికీ తెర దించుతూ రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌదరికి(Jayant Chaudhary) టికెట్ ఖరారు చేసినట్లు ప్రకటించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఇటీవల యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ ఎల్ డీ , సమాజ్ వాది పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేశాయి.
ఈ సందర్భంగా జరిగిన ఒప్పందం మేరకు జయంత్ చౌదరికి రాజ్యసభ సీటు ఖరారు చేసినట్లు టాక్. అఖిలేష్ యాదవ్ , జయంత్ చౌదరి ఇద్దరూ మంచి స్నేహితులు.
ఒకే భావజాలం కలిగిన వ్యక్తులు. కిసాన్ పోరాటంలో వీరు పాలు పంచుకున్నారు. అజిత్ సింగ్ కుమారుడు కావడం కూడా కలిసొచ్చింది జయంత్ చౌదరికి(Jayant Chaudhary). ఆయన తాత చౌదరి చరణ్ సింగ్ కూడా దేశంలో పేరొందిన నాయకుడు.
ఈ మేరకు మిత్రపక్షం అభ్యర్థి జయంత్ చౌదరిని రాజ్యసభకు మూడో అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నిర్ణయించారు. డింపుల్ ను ఎంపిక చేసినట్లు ప్రచారం రావడంతో జయంత్ చౌదరి తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
Also Read : సీబీఐ కేసు బోగస్ – కార్తీ చిదంబరం