Samantha : ఆ సాంగ్ పై సామ్ కీల‌క కామెంట్స్

ఊహించ‌ని రీతిలో ఊ అంటావా స‌క్సెస్

Samantha  : తెలుగు, త‌మిళ సినీ రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేకత క‌లిగిన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది న‌టి స‌మంత‌. ఈ అమ్మ‌డు ఈ మ‌ధ్య మోస్ట్ పాపుల‌ర్ గా మారి పోయారు.

గ‌తంలో ఎన్నో సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల రిలీజ్ అయి పాన్ ఇండియాలో దుమ్ము రేపిన పుష్ప మూవీ స‌మంత‌కు(Samantha )మ‌రింత క్రేజ్ తీసుకు వ‌చ్చేలా చేసింది.

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , క్ర‌ష్మిక ర‌ష్మిక మందాన క‌లిసి న‌టించిన ఈ మూవీలో స్పెష‌ల్ సాంగ్ లో స‌మంత(Samantha )మెరిసింది.

త‌న అంద చందాల‌తోనే కాదు అద్భుతంగా డ్యాన్స్ చేసి కోట్లాది హృద‌యాల‌ను కొల్ల‌గొట్టేలా చేసింది.

కేవ‌లం విడుద‌లైన 20 రోజుల్లోనే 100 మిలియ‌న్ల వ్యూస్ తో దుమ్ము రేపింది. నెట్టింట్లో షేక్ చేసింది.

ఇప్ప‌టికీ ఆ పాట టాప్ లో నిలిచింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తే చంద్ర‌బోస్ ఈ పాట‌ను రాశారు.

ఇక స్టార్ సింగ‌ర్ మంగ్లీ చెల్లెలు ఇంద్రావ‌తి చౌహాన్ ఈ పాట‌ను పాడింది.

ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఊ అంటావా మావా ఉఊ అంటావా అంటూ పాట‌నే వినిపిస్తోంది.

క‌న్న‌డ‌, త‌మిళం, తెలుగు, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా చిత్రంగా దీనిని విడుద‌ల చేశారు.

బ‌న్నీ కెరీర్ లో ఇది హ‌య్య‌స్ట్ వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచి పోయింది.

ఇక ర‌ష్మియ నేష‌న‌ల్ క్ర‌ష్ గా మారి పోతే స‌మంత మాత్రం టాప్ హీరోయిన్ గా పేరొందింది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు అక్కినేని ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. నాగ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేసింది.

ఆ త‌ర్వాత అవ‌కాశాలు అపారంగా వ‌స్తున్నాయి. అటు సినిమాల్లో ఇటు వెబ్ సీరీస్ ల‌లో దుమ్ము రేపుతోంది. అవార్డ్స్ ఫంక్ష‌న్ లో ఈ సాంగ్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది స‌మంత.

Also Read : హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌పై చీటింగ్ కేసు

Leave A Reply

Your Email Id will not be published!