Samatha Kumbh 2023 : ‘గీత’ మానవత్వాన్ని నేర్పే గ్రంథం
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి
Samatha Kumbh 2023 : భగవద్గీత మానవత్వాన్ని నేర్పే అద్భుతమైన గ్రంథమని అన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి. సమతా కుంభ్ 2023 ఉత్సవాలలో భాగంగా శంషా బాద్ ముచ్చింతల్ దివ్య సాకేతంలో ఆదివారం విశ్వ శాంతి కోసం విరాట్ గీతా పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో సాగింది ఈ కార్యక్రమం. ఫిబ్రవరి 2న సమతా కుంభ్ ఉత్సవాలు(Samatha Kumbh 2023) ప్రారంభం అయ్యాయి. శ్రీరామ నగరం అంతా జై శ్రీమన్నారాయణ నామ స్మరణతో మారు మ్రోగింది.
బ్రహ్మోత్సవాలలో ఇది పదవ రోజు. గీతా పారాయణం కార్యక్రమం జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, దేవనాథ స్వామి, రామచంద్ర రామానుజ జీయర్ , అహోబిలం జీయర్ ల ఆధ్వర్యంలో జరిగింది. భక్త బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భగవద్గీత లోని 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పారాయణం చేశారు.
ఉత్సవాలను(Samatha Kumbh 2023) ఉద్దేశించి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ప్రసంగించారు. భగవద్గీతను పారాయణం చేస్తే సాక్షాత్తు ఆ భగవంతుడిని ప్రార్థించినట్లేనని అన్నారు. భగవద్ రామానుజుల సన్నిధిలో గీతా పారాయణం చేయడం మనందరి అదృష్టమన్నారు.
ఆయన ఉపదేశించిన సమతా మానవతను ఆదర్శంగా తీసుకోవాలని ఉద్భోదించారు. సమాజంలో కుల, మత , లింగ భేదాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని సూచించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి.
గీత నేర్చుకునేందుకు యోగ్యత అక్కర్లేదని మనిషి అయి ఉంటే చాలని అన్నారు. గీతను మత గ్రంథమని కొందరు భావిస్తున్నారు. అది మత గ్రంథం కాదు మానవత్వాన్ని నేర్పే అద్భుతం అని పేర్కొన్నారు.
Also Read : యాదగురిగుట్ట తరహాలో కొండగట్టు