Ramanujacharya Swamy : స‌మ‌తామూర్తి నిత్య స్పూర్తి

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి

Ramanujacharya Swamy  : స‌మ‌తామూర్తి అందించిన స్పూర్తి క‌ల‌కాలం కొన‌సాగాల‌ని పిలుపునిచ్చారు జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి. ప‌ద‌మూడు రోజుల పాటు నిర్వ‌హించిన స‌మతామూర్తి స‌హ‌స్రాబ్ది మ‌హోత్స‌వాలు ముగిశాయి.

ఈనెల 2 నుంచి 14 దాకా అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు దేశం న‌లుమూల‌ల నుంచి త‌ర‌లి వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌ను ఉద్దేశించి ఉప‌దేశం చేశారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Ramanujacharya Swamy ). ప‌రుల ప‌ట్ల సానుకూలంగా ఉండాలి. అంత‌కంటే ఎక్కువ‌గా తోటి ప్రాణుల ప‌ట్ల ప్రేమ‌ను క‌లిగి ఉండాలి.

సేవ చేయ‌డం వ‌ల్ల‌నే జీవితం మ‌రింత అర్థ‌వంతంగా మారుతుంది. దానికి భ‌క్తి అనే దానిని జోడిస్తే మ‌రింత బాగుంటుంద‌న్నారు. వీలైనంత వ‌ర‌కు దైవం ప‌ట్ల ఎరుక‌తో ఉండండి.

దాని ప‌ట్ల అన్వేషిస్తూ సాగండి. ఆ భ‌గ‌వ‌ద్ శ్రీ రామానుచార్యుల అనుగ్ర‌హం ఉంటే కోరుకున్న‌ది త‌ప్ప‌క నెర‌వేరుతుంది. స‌త్ సంక‌ల్పం, స‌త్ సాంగ‌త్యం తో పాటు ధ‌ర్మ నిబ‌ద్ద‌త ఉండాలి.

స‌మ‌తామూర్తిని ద‌ర్శించు కోవ‌డం అంటే మ‌న జీవితాన్ని మ‌రింత ఆధ్యాత్మిక వైభ‌వానికి చేరుకోవ‌డం అన్న‌మాట‌. స‌మ‌తామూర్తి చూపిన మార్గం ఆద‌ర్శ‌న‌మైన‌ది. ప్రాతః స్మ‌ర‌ణ‌మైన‌ది.

అందుకే వెయ్యేళ్లు దాటినా ఇంకా నేటికీ కొన‌సాగుతూ వ‌స్తున్న‌ద‌ని శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Ramanujacharya Swamy ). కుల‌, మ‌తాలు, వ‌ర్గ‌, విభేదాల‌ను వీడండి. సేవ చేయాల‌న్న త‌ప‌నతో ముందుకు సాగాల‌ని భ‌క్తుల‌కు బోధించారు చిన్న జీయ‌ర్ స్వామి.

Also Read : మేడారం జాత‌ర కోసం 3,845 బ‌స్సులు

Leave A Reply

Your Email Id will not be published!