Samsung Hiring : సామ్‌సంగ్ లో కొలువుల మేళం
భారీగా జాబ్స్ రిక్రూట్ మెంట్ కు ఓకే
Samsung Hiring : ప్రపంచ ఆర్థిక రంగం కుదేలైందంటూ దానిని బూచీగా చూపిస్తూ దిగ్గజ కంపెనీలు ఉద్యోగాలలో కోత పెట్టడం మొదలు పెట్టాయి. మొదటగా దీనికి శ్రీకారం చుట్టింది టెస్లా చైర్మన్ ..ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్. వస్తూనే టాప్ లెవల్లో ఉన్న సిఇఓ, సీఎఫ్ఓ, లీగల్ హెడ్ లను పీకేశాడు.
ఆపై పర్మినెంట్ ఉద్యోగులు 6 వేల మందిని ఇంటికి పంపించాడు. అంతే కాదు కాంట్రాక్టు కింద పని చేస్తున్న 5 వేల మందికి చెక్ పెట్టాడు. ఇక మస్క్ ను ఆదర్శంగా తీసుకున్న ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ 11 వేల మందిని ఇంటికి సాగనంపాడు. ఆపై గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ చేదు కబురు చెప్పింది.
10 వేల మందికి మంగళం పాడింది. ఆపై తగదునమ్మా అంటూ సత్య నాదెళ్ల సిఇఓగా ఉన్న మైక్రో సాఫ్ట లో 10 వేల మందిని సాగనంపే పనిలో ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఐటీ కంపెనీలే కాదు ప్రముఖ ఇకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ 10 వేల మందిపై వేటు వేసింది. ఈ తరుణంలో ఆ తర్వాతి రంగాలలో టాప్ లో కొనసాగుతున్న మీడియా రంగంలో సైతం 6 వేల మందిని తొలగించారు.
ఈ తరుణంలో ఓ వైపు కొలువులు ఉంటాయో ఉండవోనని ఆందోళన చెందుతున్న తరుణంలో ఉన్నట్టుండి తీపి కబురు చెప్పింది ప్రముఖ దిగ్గజ సంస్థ సామ్ సంగ్(Samsung Hiring). యాపిల్, ట్విట్టర్, టెస్లా, గూగుల్, మెటా, అమెజాన్ కంపెనీలు తలదించుకునేలా భారీగా ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా ఊపింది.
ప్రతిభ, అర్హత, అనుభవం కలిగిన వారు ఎవరైనా సరే తమ సంస్థలోకి రావాలని పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించి 1,000 మంది ఇంజనీర్లు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బెంగళూరు, నోయిడా, ఢిల్లీ కేంద్రాలలో ని ఆర్డీ కేంద్రాలలో వీరిని నియమిస్తామని తెలిపింది.
Also Read : 11 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు