Sanjay Arora CP : ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా సంజయ్ అరోరా
తమిళనాడు కేడర్ కు చెందిన ఐపీఎస్
Sanjay Arora CP : ఢిల్లీ పోలీస్ బాస్ గా తమిళనాడు కేడర్ కు చెందిన 1988 బ్యాచ్ అధికారి సంజయ్ అరోరాను నియమించారు. గత ఏడాది ఆగస్టులో ఇండో టిబెటన్ బోర్డర్ ఆఫ్ పోలీస్ డీజీగా నియమితులయ్యారు.
సెప్టెంబర్ 1న ఇండియా చైనా వాస్తవాధీన రేఖ గార్డింగ్ ఫోర్స్ గా బాధ్యతలు చేపట్టారు. ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ , తమిళనాడు క్యాడర్ కు చెందిన సంజయ్ అరోరాను తదుపరి ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా నియమించినట్లు ఎంహెచ్ఏ తెలిపింది.
ఈ విషయం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ అస్థానా స్థానంలో అరోరా బాధ్యతలు చేపట్టనున్నారు. సంజయ్ అరోరా(Sanjay Arora CP) సోమవారం ఆగస్టు 1న ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపడతారు.
తదుపరి ఆర్డర్ వచ్చేంత వరకు ఆయనే బాస్ గా ఉంటారు. ఇదిలా ఉండగా సంజయ్ అరోరా రాజస్థాన్ లోని జైపూర్ లో మాల్వియా నేషనల్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
ఐపీఎస్ లో చేరాక తమిళనాడు పోలీస్ శాఖలో వివిధ హోదాలలో పని చేశారు. పోలీస్ సూపరింటెండెంట్ గా ఉన్నారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ లో
పని చేశారు. వీరప్పన్ గ్యాంగ్ కు వ్యతిరేకంగా పని చేయడంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గాను గ్యాలంట్రీ మెడల్ ను అందుకున్నారు. ఎల్టీటీఈ కార్యకలాపాలు ప్రబలంగా ఉన్న సమయంలో తమిళనాడు సీఎంకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక భద్రతా బృందాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐటీబీపీలో 1997 నుండి 2002 దాకా కమాండెంట్ గా డిప్యూటేషన్ పై పని చేశాడు. అకాడెమీలో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. 2002 నుండి 2004 దాకా కోయంబత్తూరు నగరంలో పోలీస్ కమిషనర్ గా పని చేశాడు సంజయ్ అరోరా.
Also Read : మెగా పవర్ ప్రాజెక్టుకు ప్రధానుల శ్రీకారం