Sanjay Raut : ప్రభుత్వం తాత్కాలికం కూలడం ఖాయం
జోష్యం చెప్పిన శివసేన ఎంపీ
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీపై తిరుగుబాటు ప్రకటించి భారతీయ జనతా పార్టీతో జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే ముచ్చట కొద్ది సేపే ఉండ బోతోందన్నారు.
తాజాగా బీజేపీ స్టేట్ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యల్ని సంజయ్ రౌత్(Sanjay Raut) గుర్తు చేశారు. తమకు ఏ మాత్రం ఏక్ నాథ్ షిండే సీఎం కావాలని అనుకోలేదన్నారు.
ఇది పూర్తిగా అయిష్టంగా జరిగిందని కుండ బద్దలు కొట్టారు. దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారని భావించామని కానీ బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు తల వంచాల్సి వచ్చిందని బాంబు పేల్చారు.
దీంతో మరాఠాలో మరోసారి రాజకీయం వేడెక్కింది. ఇదే సమయంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ఉద్దవ్ ఠాక్రేపై జోకు పేల్చారు.
ఆయన నిర్వాకం వల్లనే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలి పోయిందన్నారు. ఆ సంకీర్ణ సర్కార్ ను ఎవరూ కూల్చలేదని వారంతకు వారే పాలన చేత కాక తప్పించు కున్నారని ఎద్దేవా చేశారు.
ఓ వైపు చంద్ర కాంత్ పాటిల్ ఇంకో వైపు రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరాఠాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ తరుణంలో సంజయ్ రౌత్ స్పందించారు.
బీజేపీ ఎప్పుడూ తాను పవర్ లో ఉండాలని అనుకుంటుందని, కానీ ఇంకొకరి చేతుల్లో ఉండాలని అనుకోదన్నారు. అందుకే ఏక్ నాథ్ షిండేతో పాటు తమపై, పార్టీపై తిరుగుబాటు చేసిన వారంతా ఏదో ఒకరోజు మాత్రోశ్రీ తలుపులు తట్టాల్సిందేనని స్పష్టం చేశారు.
Also Read : షిండేపై బీజేపీ చీఫ్ షాకింగ్ కామెంట్స్