Sanjay Raut : 15 రోజులు సూర్యోదయాన్ని చూడలేదు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్స్
Sanjay Raut : మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఇటీవలే బెయిల్ పై విడుదలైన శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మూడు నెలలకు పైగా జైలు ఉన్నారు. తాను అసలైన బాలా సాహెబ్ అనుచరుడినంటూ ప్రకటించారు.
మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చోటు చేసుకున్న పరిణామాలపై నిప్పులు చెరిగారు. సంజయ్ రౌత్(Sanjay Raut) చివరి దాకా షిండే తిరుగుబాటులో మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అండగా నిలిచారు. ఆపై కేంద్రాన్ని, ప్రధాని మోదీని, హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏకి పారేశారు.
ఈ తరుణంలో షిండే, బీజేపీ సర్కార్ కొలువు తీరింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఆయన ఓ జాతీయ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తాను జైలులో ఉన్న సమయంలో 15 రోజుల పాటు సూర్య కిరణాలు ఎలా ఉంటాయో కూడా చూడలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు సంజయ్ రౌత్.
ఆయన తనకు తాను యుద్ద ఖైదీగా పిలుచుకున్నారు. తాను బీజేపీకి లొంగి పోయి ఉంటే లేదా మౌనంగా ఉన్నట్లయితే ఇవాళ తాను జైలుకు వెళ్లి ఉండేవాడిని కాదన్నారు సంజయ్ రౌత్(Sanjay Raut) . ప్రభుత్వం కేవలం ప్రతిపక్షంలో ఉన్న వారిని మాత్రమే అరెస్ట్ చేస్తుందన్న విషయం తన విషయంలో తేలిందన్నారు.
జైలులో ఉన్న సమయంలో పుస్తకాలు, పత్రికలు చదివానని అంతే కాదు 10 కిలోల బరువు కూడా తగ్గానని చెప్పారు . ఈ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే కారణం వారేనని కొనియాడారు. నాయకులు వారి వైపు ఉన్నారని కానీ ప్రజలు తమ వైపు ఉన్నారని అన్నారు సంజయ్ రౌత్.
Also Read : డిడిడిసీ వైస్ చైర్ పర్సన్ ఆఫీసుకు తాళం
