Sanjay Raut Threat : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది – రౌత్
Sanjay Raut Threat : శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈరోజు తన మొబైల్ ఫోన్లో టెక్స్ట్ సందేశాల ద్వారా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి అని తెలిపారు. రౌత్ శుక్రవారం రాత్రి బెదిరింపు(Sanjay Raut Threat) గురించి ముంబై పోలీసులకు తెలియజేసినట్లు చెప్పారు.
ప్రస్తుతం పంజాబ్ జైలులో ఉన్నడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ . దీనిపై పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
“నా ఫోన్లో నాకు బెదిరింపు వచ్చింది, దాని గురించి నేను పోలీసులకు సమాచారం ఇచ్చాను. కానీ ఈ ప్రభుత్వం సీరియస్‌గా లేదు. గతంలో కూడా నన్ను బెదిరించారు, కానీ రాష్ట్ర హోం మంత్రి దీనిని స్టంట్ అని పిలిచారు,” అని రౌత్ అన్నారు. ప్రతిపక్ష నేతల భద్రతపై రాష్ట్రం సీరియస్‌గా లేదు.
సంజయ్ రౌత్(Sanjay Raut) ఇది తనను ఇబ్బంది పెట్టదని, తన భద్రతను ఉపసంహరించుకున్నప్పుడు తాను ఎలాంటి లేఖ రాయలేదని అన్నారు.
రౌత్‌కు బెదిరింపు సందేశం వచ్చిన నంబర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యకు కరడుగట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన సూత్రధారి. అతను గాయకుడి తండ్రి బాల్కౌర్ సింగ్ మరియు నటుడు సల్మాన్ ఖాన్‌ను కూడా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Also Read : కేరళ విమానాశ్రయంలో ₹ 2 కోట్ల విలువైన బంగారం స్వాధీనం