Sanjay Raut : శివ‌సేన అధికారం కోసం పుట్ట‌లేదు – రౌత్

మ‌రాఠా ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ మ‌రిచి పోరు

Sanjay Raut : మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వం కూలి పోయింది. ఉద్ద‌వ్ ఠాక్రే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. గురువారం జ‌ర‌గాల్సిన బ‌ల‌ప‌రీక్ష‌ను ర‌ద్దు చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను అవ‌మానించ‌డాన్ని త‌ట్టుకోలేక పోతున్న‌ట్లు పేర్కొన్నారు ఉద్ద‌వ్ ఠాక్రే.

రెబ‌ల్ ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుతో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రాఠాలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌తోంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కొలువు తీర‌నున్నారు.

ఇక ధిక్కార స్వ‌రం ప్ర‌క‌టించిన మంత్రి ఏక్ నాథ్ షిండే త‌మ ఎమ్మెల్యేల‌తో బీజేపీకి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా ఈ మొత్తం వ్య‌వ‌హారంపై శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut)  స్పందించారు.

శివ‌సేన పార్టీ ఎప్పుడూ అధికారాన్ని కోరుకోలేద‌న్నారు. అధికార‌మే శివ‌సేన కోసం పుట్టింద‌ని స్ప‌ష్టం చేశారు. కేంద్రంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎలాంటి ప్ర‌యోగాలు చేస్తోంద‌న‌నే దానిని ప్ర‌జ‌లు ద‌గ్గ‌రుండి చూశారన్నారు.

అయితే శివ‌సేన పార్టీ పేరుతో గెలుపొందిన వారు ధిక్కార స్వ‌రం వినిపించ‌డం వారికి పార్టీ ప‌ట్ల ఉన్న నిబ‌ద్ద‌త అనేది ఏపాటిదో తెలుస్తుంద‌న్నారు. రేపు జ‌రిగే నిర్ణ‌యాత్మ‌క ఎన్నిక‌ల్లో స‌రైన తీర్పు ఇస్తార‌ని హెచ్చ‌రించారు.

గ‌త రెండున్న‌ర ఏళ్ల కాలంలో తాము అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తికి కృషి చేయ‌డం జరిగింద‌న్నారు సంజ‌య్ రౌత్.

అంతే కాదు బీజేపీయేత‌ర ప్రాంతాలు, రాష్ట్రాలు, వ్య‌క్తులు, ప్ర‌జాప్ర‌తినిధులు, సంస్థ‌ల‌ను ధ్వంసం చేయ‌డం ప‌నిగా కేంద్రం పెట్టుంద‌ని ఆరోపించారు.

Also Read : ఉద‌య్ పూర్ ఘ‌ట‌న బాధాక‌రం – తికాయ‌త్

Leave A Reply

Your Email Id will not be published!