Sanjay Raut KCR : కేసీఆర్ పై సంజ‌య్ రౌత్ క‌న్నెర్ర‌

ఆయ‌న‌కు అంత సీన్ లేద‌ని కామెంట్

Sanjay Raut KCR : శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్యస‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ నిప్పులు చెరిగారు. ఆయ‌న భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ చీఫ్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావును ఏకి పారేశారు. ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. పాలిటిక్స్ లో పావులు క‌ద‌ప‌డం ఆయ‌న‌కు ఒక్క‌డికే చెల్లుబాటు అవుతుంద‌ని అనుకుంటున్నాడ‌ని, మ‌రాఠా రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయ‌న్నారు.

మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌ను త‌క్కువ అంచ‌నా వేస్తే బోర్లా ప‌డడం త‌ప్ప ఇంకేమీ ఉండ‌ద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సంజ‌య్ రౌత్(Sanjay Raut). కేసీఆర్ ఇక నుంచి ఫెయిర్ గా ఉండ‌డం నేర్చుకోవాల‌ని లేక పోతే ఇలాగే డ్రామాలు చేస్తూ పోతే పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు. ఒక ర‌కంగా కేసీఆర్ పై క‌న్నెర్ర చేశారు రాజ్య‌స‌భ ఎంపీ.

ఆయ‌న ప‌దే ప‌దే మ‌రాఠాపై ఫోక‌స్ చేస్తే ఉన్న‌ది, ఉంచుకున్న తెలంగాణ కూడా గాయ‌బ్ అవుతుంద‌ని ఎద్దేవా చేశారు సంజ‌య్ రౌత్. కేసీఆర్ ఎవ‌రి కోసం ప‌ని చేస్తున్నారో, ఎందుకోసం ప‌ని చేస్తున్నారో దేశ ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. త్వ‌ర‌లో తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ముందు త‌న రాష్ట్రంపై ఫోక‌స్ పెట్టాల్సిన కేసీఆర్ మ‌రాఠాలో తిరిగితే ఏం ఫాయిదా అని ఎద్దేవా చేశారు. మ‌హారాష్ట్రలో మ‌హా వికాస్ అఘాడీకి బ‌లంగా ఉంద‌ని, దీనిని త‌ట్టుకునే శ‌క్తి బీఆర్ఎస్ కు లేద‌ని స్ప‌ష్టం చేశారు సంజ‌య్ రౌత్. ప్ర‌స్తుతం రౌత్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Shashi Tharoor : శ‌శి థ‌రూర్ షోయ‌బ్ అక్త‌ర్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!