Sanjay Raut : భారతీయ జనతా పార్టీపై మరోసారి శివసేన నిప్పులు చెరిగింది. శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో గౌరవ ఎడిటర్ గా ఉన్న ఎంపీ సంజయ్ రౌత్ ప్రతి వారం ఓ కాలమ్ రాస్తూ వస్తున్నారు.
ఈసారి అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపిన గాడ్సే ను ప్రేమించే బీజేపీ, దాని అనుబంధ సంస్థల వారు ఇప్పుడు విదేశ జపం చేస్తున్నారంటూ ఆరోపించారు.
విచిత్రం ఏమిటంటే బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ను అహ్మదాబాద్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడాన్ని తప్పు పట్టారు. హోర్డింగ్ లు ఏర్పాటు చేయడాన్ని మండిపడ్డారు సంజయ్ రౌత్(Sanjay Raut).
బీజేపీ నాయకులు నాథూరామ్ గాడ్సే సిద్దాంతాన్ని సమర్థించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కానీ విదేశీ అతిథులు వచ్చినప్పుడు , వారు నూలు నేసేందుకు తీసుకు వెళ్ళడం దారుణమని పేర్కొన్నారు సంజయ్ రౌత్(Sanjay Raut) .
మత హింసా కాండ ను ప్రోత్సహిస్తూ మనుషుల మధ్య విభేదాలు, అల్లర్లు సృష్టిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉన్నప్పటికీ విదేశీ ప్రముఖులను ఇప్పటికీ సబర్మతీ ఆశ్రమానికి తీసుకు వెళుతున్నారంటూ మండిపడ్డారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పక్కా వ్యాపారం చేస్తోందంటూ ధ్వజమెత్తారు శివసేన. గుజరాత్ లో ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గొప్ప విగ్రహం ఉన్నా ఎందుకు గాంధీ వద్దకు ఎందుకు తీసుకు వెళ్లారని ప్రశ్నించింది.
ఎందుకంటే గాంధీ ఇప్పుడు యూనివర్శల్ క్యాండిడేట్ అని పేర్కొన్నారు సంజయ్ రౌత్. ఈ దేశంలో మోదీని మించిన ప్రచార కర్త ఎవరూ లేరంటూ పేర్కొన్నారు.
Also Read : భగవంత్ మాన్ నా సోదరుడు – సిద్దూ