Sanjay Raut : శివసేన అంతానికి బీజేపీ కుట్ర – రౌత్
సంచలన కామెంట్స్ చేసిన శివసేన ఎంపీ
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి కేంద్ర సర్కార్, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. బీజేపీ మహారాష్ట్రలో అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆరోపించారు.
అంతే కాకుండా మరాఠా యోధుడు బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలని అనుకుంటున్నారంటూ ఆరోపించారు. కానీ వారి కుట్రలు, ఆటలు సాగవన్నారు.
శివసేన సైనికులు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని దరి దాపుల్లోకి రానివ్వరంటూ స్పష్టం చేశారు. శివసేన పేరుతో గెలిచి రాజకీయంగా పదవులు పొందిన వారు ఇప్పుడు నీతులు వల్లె వేస్తున్నారంటూ మండిపడ్డారు సంజయ్ రౌత్.
పార్టీలో చీలికలు తీసుకు రావడం, అసంతృప్తుల పేరుతో నీచ రాజకీయాలకు పాల్పడడం ఒక పరిపాటిగా మారిందన్నారు. ప్రాంతీయంగా మరింత బలంగా ఉన్న శివసేనను నిర్వీర్యం చేయాలని కుట్రలు పన్నుతోందంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు.
బీజేపీ చీఫ్, ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కుఠిల నీతి ఏమిటో మరాఠా ప్రజలకు తెలిసి పోయిందన్నారు. ఏక్ నాథ్ షిండే కు గుర్తింపు తీసుకు వచ్చేలా చేసింది శివసేన పార్టీ అన్న సంగతి మరిచి పోతే ఎలా అని ప్రశ్నంచారు సంజయ్ రౌత్(Sanjay Raut).
విలువలను వదిలేసిన వాళ్లకు సమాజంలో గౌరవం అంటూ ఉండదని తెలుసు కోవాలన్నారు. మరాఠా శివసేన పార్టీలో చరిత్ర హీనులుగా మిగిలి పోవడం ఖాయమన్నారు.
తిరుగుబాటు ప్రకటించిన వారంతా బాలా సాహెబ్ అనుచరులు కాదని, ద్రోహులు అంటూ ఆరోపించారు సంజయ్ రౌత్.
Also Read : అమిత్ షాతో షిండే..ఫడ్నవీస్ భేటీ