Sanjay Raut : మరాఠా పాతాళంలా నడుస్తోంది – రౌత్
రాష్ట్ర సర్కార్ పై నిప్పులు చెరిగిన ఎంపీ
Sanjay Raut Maharashtra : శివసేన (యుబీటీ) జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. గురువారం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రస్తుతం పాతాళంలా నడుస్తోందని మండిపడ్డారు. నేరస్థులు, అవినీతి పరులకు రక్షణ కల్పిస్తున్నారని , సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు తమ ముఠాలను స్వంతంగా ఎవరికి వారే నడుపుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
పాలన గతి తప్పిందని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడిందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి వేశారని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు సంజయ్ రౌత్(Sanjay Raut Maharashtra). మరాఠా సర్కార్ పై విరుచుకు పడ్డారు. రాష్ట్రం ఒకప్పుడు ముంబైలో పని చేసిన పాతాళంలా అనిపిస్తోందన్నారు. దీనిని నేను ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అనుకోవడం లేదన్నారు సంజయ్ రౌత్.
ప్రత్యర్థులపై కేంద్ర ఏజెన్సీలను యధేశ్చగా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ 14 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టి వేసింది. దీనిపై తాము విజయం సాధించినంతగా బీజేపీ సంబురాలు చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఎవరైనా వ్యక్తిగతంగా ఇబ్బంది పడితే నేరుగా పిటిషన్ దాఖలు చేయవచ్చని ధర్మాసనం పేర్కొందని ఆ విషయం కూడా తెలుసుకోక పోతే ఎలా అని ప్రశ్నించారు రాజ్యసభ ఎంపీ.
Also Read : హోం మంత్రిగా ఫడ్నవీస్ ఫెయిల్