Sanjay Raut : మరాఠాలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. మాటలు తూటాల కంటే పవర్ ఫుల్ గా పేలుతున్నాయి. కేంద్రం వర్సెస్ ఎన్సీప సర్కార్ మధ్య భగ్గుమంటోంది. మహా నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే మరాఠా ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
ఆయన 4 వరకు డెడ్ లైన్ విధించారు. మూడో తేదీ దాకా చూస్తామని ఇక ఆగబోమంటూ స్పష్టం చేశారు. బుధవారం వరకు ప్రార్థనా మందిరాల వద్ద ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఔరంగాబాద్ లో ఆయన రెచ్చగొట్టే ప్రసంగం చేశారంటూ పోలీస్ కేసు నమోదైంది. ఈ తరుణంలో శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) భగ్గుమన్నారు.
ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రత్యర్థులపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
లా అండ్ ఆర్డర్ దెబ్బ తినేలా భారతీయ జనతా పార్టీ, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన కాంట్రాక్టు తీసుకున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.
మహారాష్ట్రపై కుట్ర జరుగుతోందని అందులో భాగంగానే ఈ డెడ్ లైన్ ప్రకటనలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి నుంచి జనాల్ని తీసుకు వచ్చి అల్లర్లు సృష్టించేందకు ప్లాన్ చేస్తున్నారంటూ సంజయ్ రౌత్(Sanjay Raut) సీరియస్ అయ్యారు.
ప్రతిపక్షాలు చేస్తున్న పన్నాగాల్ని గుర్తించామని, వారిని ఎలా కంట్రోల్ చేయాలో తమకు బాగా తెలుసన్నారు. ఎవరి బెదిరింపులకు తాము భయపడ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు సంజయ్ రౌత్.
Also Read : ఎల్ఐసీ ఐపీఓపై కాంగ్రెస్ సీరియస్