Sanjay Raut : బీజేపీ ఆటలు సాగవు సర్కార్ కూలదు
మోదీ సర్కార్ పై నిప్పులు ఎంపీ రౌత్
Sanjay Raut : మహారాష్ట్రలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో, తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార శివసేన కూటమికి కోలుకోలేని షాక్ తగిలింది.
భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో పుంజుకుంది. శాసన మండలి ఎన్నికలు ముగిసిన కొద్ది గంటల్లోనే భారీ షాక్ తగిలింది మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి.
రాష్ట్ర మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే , 13 మంది ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్ లోని సూరత్ లోని ఓ హోటల్ లో సమావేశం కావడం కలకలం రేపింది.
ప్రస్తుత సంకీర్ణ సర్కార్ లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి మహా వికాస్ అఘాడిగా ఏర్పాటు చేసింది. దీంతో ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగడంతో శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) స్పందించారు.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పటికే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చింది. ఇప్పుడు దాని టార్గెట్ మహారాష్ట్రపై పడింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ఆటలు సాగవన్నారు.
ప్రభుత్వం ఎప్పటి లాగే ఉంటుందని, దానికి వచ్చిన ఢోకా ఏమీ లేదన్నారు ఎంపీ. మధ్య ప్రదేశ్ , రాజస్తాన్ లలో మాదిరిగానే పడగొట్టేందుకు కుట్ర జరుగుతోందన్నది వాస్తవమన్నారు.
అయినా వారి కుట్రల్ని ఛేదిస్తామని, తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది అంటూ ఏమీ లేదన్నారు సంజయ్ రౌత్(Sanjay Raut).
ఇదిలా ఉండగా ఏక్ నాథ్ ముండే థానేలో ప్రముఖ నాయకుడు. శివసేన పార్టీని మరింత బలోపేతం చేయడంలో కృషి చేశారు. ఆయన తనయుడు డాక్టర్ శ్రీకాంత్ షిండే కళ్యాణ్ నియోజకవర్గం నుండి శివసేన ఎంపీగా గెలుపొందాడు.
Also Read : మరాఠా సర్కార్ లో షిండే ‘క్యాంపు’ కలకలం