Sanjay Raut : మోదీ సర్కార్ పై రౌత్ కన్నెర్ర
ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా
Sanjay Raut : శివసేన ఎంబీటీ ఎంపీ సంజయ్ రౌత్ నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ మండిపడ్డారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. మణిపూర్ గత కొంత కాలంగా మండుతోంది. అగ్గి రాజేసింది మీరే, ఆర్పకుండా రాజకీయం చేస్తున్నది మీరేనంటూ భారతీయ జనతా పార్టీపై , ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు.
Sanjay Raut Asking
గత మే 3 నుంచి మణిపూర్ లో కంటిన్యూగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. 10 వేల మందికి పైగా సైనికులు మోహరించారు. కానీ ఇప్పటి వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడం లేదు. కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కార్. రాష్ట్రంలో కూడా ఉన్నది కూడా బీజేపీనే. మరి ఎందుకు కంట్రోల్ చేయలేక పోతున్నారంటూ నిలదీశారు సంజయ్ రౌత్(Sanjay Raut).
ఇదిలా ఉండగా మణిపూర్ లో ఇంత ఘోరాలు చోటు చేసుకుంటున్నా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించక పోవడం దారుణమన్నారు. రాజ్యసభలో ప్రధాని సమాధానం చెప్పాలని అడిగినందుకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఎలా సస్పెండ్ చేశారంటూ నిలదీశారు..తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రౌత్. సిగ్గుతో తల వంచుకోవాలని అన్నారు.
Also Read : RIP Twitter Viral : ట్విట్టర్ లోగో వైరల్