Sanjay Raut : ముగియనున్న సంజయ్ రౌత్ కస్టడీ
కోర్టులో హాజరు పరిచేందుకు ఈడీ రెడీ
Sanjay Raut : శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) ను ఈడీ అదుపులోకి తీసుకుంది. కోర్టులో హాజరు పర్చడంతో నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకుంది.
గురువారంతో కస్టడీ ముగియడంతో ఆయనను ప్రత్యేక కోర్టులో హాజరు పర్చనున్నారు. రౌత్ తో పాటు కుటుంబం రూ. 1.06 కోట్ల కళంకిత డబ్బు పొందినట్లు గుర్తించింది ఈడీ.
పత్రా చాల్ రీడెవలప్ మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ ను ఆదివారం అర్ధరాత్రి ఈడీ అరెస్ట్ చేసింది.
రియల్ ఎస్టేట్ కంపెనీ హౌసింగ్ డెవలప్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్ డి ఐఎల్ ) నుండి ప్రవీణ్ రౌత్ అందుకున్న రూ. 112 కోట్లలో రౌత్, ఫ్యామిలీ రూ. 1.06 కోట్లు ప్రత్యక్షంగా లబ్ది పొందారంటూ ఈడీ వెల్లడించింది.
ఈడీ తరపు న్యాయవాది హితేన్ వెనెగావ్ కర్ కోర్టుకు తెలిపారు. ఇందులో సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ అవని ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లో రూ. 5.625 పెట్టుబడిపై రాబడిగా రూ. 13.94 లక్షలు అందుకున్నట్లు తెలిపింది.
ప్రవీణ్ రౌత్ భార్య మాధురి పేరు మీదుంది ఈ సంస్థ. హెచ్ డీ ఐఎల్ ప్రమోటర్లు రాకేశ్ వాధవాన్ , అతని కుమారుడు సారంగ్ వాధవన్ , గోరే గావ్ లోని పత్రా చాల్ ను పునరాభివృద్ధి చేపట్టిన హెచ్ డీ ఐఎల్ అనుబంధ సంస్థగా ఉంది.
గురు ఆశిష్ కన్ స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ రౌత్ లపై మార్చి 2018లో నమోదైన కేసు ఆధారంగా సంజయ్ రౌత్ పై ఈడీ కేసు నమోదు చేసింది.
Also Read : టోల్ ట్యాక్స్ కు తాను తండ్రి లాంటోడిని