MP Sanjay Singh : సిసోడియా పిల్లల కోసం కష్టపడ్డారు
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కామెంట్
MP Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలని వేధింపులకు పాల్పడుతోందంటూ ఆరోపించారు.
ఢిల్లీ విద్యా శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను ప్రస్తుతం టార్గెట్ చేసిందన్నారు. సోమవారం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
కేంద్రం ఈ దేశానికి ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ ఢిల్లీ ప్రభుత్వం ఇవాళ అనేక సంస్కరణలు తీసుకు వచ్చిందని స్పష్టం చేశారు.
మనీష్ సిసోడియా నిజాయితీ కలిగిన వ్యక్తి అని స్పష్టం చేశారు సంజయ్ సింగ్(MP Sanjay Singh) . ఢిల్లీ లోని 18 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించిన ఘనత సిసోడియాదేనని పేర్కొన్నారు ఎంపీ.
పిల్లలు బాగు పడాలని, భవిష్యత్తులో వారంతా మరింత రాణించాలని నిరంతర తపనతో కష్టపడ్డారని చెప్పారు. తామంతా కొన్ని గంటలు మాత్రమే పని చేస్తే మనీష్ సిసోడియా మాత్రం 24 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకించి పిల్లల చదువు కోసం కేటాయించారని అన్నారు.
కానీ కేంద్రం పిల్లలకు చదువు చెప్పించడాన్ని జీర్ణించుకోలేక పోతోందని ఆరోపించారు. ఇవాళ కాక పోయినా రేపైనా నిజం తెలుస్తుందన్నారు.
అప్పులు లేని బడ్జెట్ ను తీసుకు వచ్చిన ఘనత ఈ దేశంలో ఒక్క ఆప్ సర్కార్ కే ఉందన్నారు సంజయ్ సింగ్. తనను ఏదో రకంగా వేధింపులకు గురి చేయడం పనిగా పెట్టుకుందన్నారు.
మనీష్ సిసోడియాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని దీనిని మానుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు సింగ్.
Also Read : పార్థా ఛటర్జీ ఫోన్ చేసినా పలకని సీఎం
Manish Sisodia is an honest Education Minister. He is working hard round the clock to provide quality education to 18 lakh children in Delhi. Harassing him daily & slapping false cases on him is an attempt to create hurdles in the functioning of a state govt: AAP MP Sanjay Singh pic.twitter.com/HMpnAAkzFu
— ANI (@ANI) July 25, 2022