Sanjay Singh : మణిపూర్ హింసపై మాటల్లేవ్
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కామెంట్స్
Sanjay Singh : మణిపూర్ లో చోటు చేసుకున్న హింస ఇప్పట్లో తగ్గేలా లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ఇన్ని దారుణాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. బాధ్యత లేకుండా , తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎందుకు ఉన్నారంటూ మండిపడ్డారు.
MP Sanjay Singh Asking
సోమవారం రాజ్యసభ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనికి బేషరతుగా సమాధానం చెప్పాలని, మణిపూర్ హింసకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహం చెందిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపీని పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
తను లేవదీసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వేటు వేసినంత తాను వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh). మణిపూర్ లో నగ్నంగా ఊరేగించిన మహిళ భర్త కార్గిల్ యుద్దంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ అన్నారు. మోదీ జీ కనీసం సిగ్గు పడక పోవడం దారుణమన్నారు ఎంపీ. మోదీ పార్లమెంట్ కు రాకుండా ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు.
మణిపూర్ ఘటన, అన్యాయంపై మాట్లాడక పోవడం , డ్రామాలు చేయడం, రేపిస్టులకు మద్దతుగా నిలవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు ఎంపీ సంజయ్ సింగ్. ఈ మొత్తం వ్యవహారంతో దేశం యావత్తు సిగ్గు పడుతోందన్నారు.
Also Read : Raghav Chadha : చీకట్లో ప్రజాస్వామ్యం – రాఘవ్ చద్దా