MP Sanjay Singh : ఎల్జీ నోటీసుల్ని చించేసిన ఆప్ ఎంపీ
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నోటీసు
MP Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కంటతడి పెట్టారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా పరువు నష్టం నోటీసును ఎంపీకి పంపించారు. బిగ్ షాకకు గురయ్యారు సంజయ్ సింగ్(MP Sanjay Singh) .
మద్యం పాలసీలో అవినీతి ఆరోపణలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులు చేపట్టింది. ఆనాటి నుంచి నేటి దాకా ఆప్ నేతలు ఎల్జీ సక్సేనాను టార్గెట్ చేశారు.
ఆయనపై పలు సంచలన ఆరోపణలు చేశారు. ఖాదీ స్కామ్ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(Vinay Kumar Saxena) పంపిన నోటీసును సంజయ్ సింగ్ చించేశారు.
భారత రాజ్యాంగం నాకు నిజం మాట్లాడే హక్కు ఇచ్చిందన్నారు. బుధవారం ఆప్ ఎంపీ మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడిగా మాట్లాడే రైట్ తనకు ఉందన్నారు.
ఒక దొంగ, అవినీతి పరుడు పంపిన ఈ నోటీసుకు నేను భయపడే ప్రసక్తే లేదన్నారు సంజయ్ సింగ్ . ఇలాంటి నోటీసులు తాను ఎన్నో ఎదుర్కొన్నానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా మద్యం వ్యాపారంలోకి ప్రైవేట్ వ్యక్తులు ఎంట్రీ ఇవ్వడానికి కొత్త ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ఎల్జీ సిబీఐ విచారణకు ఆదేశించారు. దీనిని తీవ్రంగా తప్పు పట్టింది ఆప్ సర్కార్(Arvind Kejriwal).
ఈ మేరకు జూలైలో ఉపసంహరించుకుంది. కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్రతీకార చర్యలకు దిగుతున్నారంటూ ఆప్ ఫైర్ అయ్యింది.
తాను చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు ఎంపీ.
Also Read : 27న కేంద్రం..ఢిల్లీ వివాదంపై తీర్పు