Shantishri Dhulipudi Pandit : జేఎన్‌యూ వీసీగా శాంతిశ్రీ పండిట్

పూలే పూణే వ‌ర్శిటీలో ప్రొఫెస‌ర్

Shantishri Dhulipudi Pandit  : దేశంలో అత్యున్న‌త‌మైన‌, అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన విశ్వ విద్యాల‌యంగా భావించే జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ యూనివ‌ర్శిటీకి వైస్ ఛాన్స్ ల‌ర్ ను నియ‌మించింది కేంద్ర ప్ర‌భుత్వం.

విచిత్రం ఏమిటంటే ఆమె మొట్ట మొద‌టి మ‌హిళా వీసీ కావ‌డం.

జేఎన్‌యూ వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి పండిట్(Shantishri Dhulipudi Pandit )ను నియ‌మించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఆమె జేఎన్‌యూలో పూర్వ విద్యార్థి కూడా. 1986 నుంచి 1990 మ‌ధ్య దాని స్కూల్ ఆఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్ట‌డీస్ నుండి ఎంఫిఎల్ ,

పీహెచ్ డీ చేశారు శాంతిశ్రీ పండిట్. ప్ర‌స్తుతం ఈ యూనివ‌ర్శిటీకి శాంతిశ్రీ పండిట్ 13వ వైస్ ఛాన్స్ ల‌ర్ .

ఇక వీసీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన తేదీ నుంచి ఐదు సంవ‌త్స‌రాల పాటు ఉంటారు.

ప్ర‌స్తుతం శాంతిశ్రీ ధూళిపూడి పండిట్Shantishri Dhulipudi Pandit )సావిత్రీబాయి పూలే పూణే యూనివ‌ర్శిటీలో ప్రొఫెస‌ర్ గా ప‌ని చేస్తున్నారు.

ఆమె అనుభ‌వాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే జేఎన్‌యూ వీసీగా శాంతిశ్రీ పండిట్ ను ప్ర‌త్యేకంగా ఏరికోరి ఎంచుకుంది.

జ‌వ‌హ‌ర్ లాల్ యూనివ‌ర్శిటీ చ‌ట్టాల ద్వారా త‌న‌కు అందించ‌బ‌డిన అధికారాల‌ను ఉప‌యోగించారు రాష్ట్ర‌ప‌తి. రామ్ నాథ్ కోవింద్ జేఎన్ యూ సంద‌ర్శ‌కుడిగా త‌న హోదాలో పండిట్ ని వైస్ ఛాన్స్ ల‌ర్ గా నియ‌మించ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.

ఈ మేర‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ జేఎన్ యూ రిజిస్ట్రార్ కు లేఖ కూడా రాసింది. ఇదిలా ఉండ‌గా పూణె లోని యూనివ‌ర్శిటీలో రాజ‌కీయాలు, ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగంలో ప్రొఫెస‌ర్ గా ఉన్నారు.

ఉన్న‌త విద్యా నియంత్ర‌ణ సంస్థ యూనివ‌ర్శిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ గా నియ‌మితులైన జ‌గ‌దీష్ కుమార్ ప్లేస్ లో ఎంపిక‌య్యారు.

పండిట్ చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి పొలిటిక‌ల్ సైన్స్ లో మాస్ట‌ర్స్ చేశారు. ఆమె గోవా యూనివ‌ర్శిటీలో కూడా బోధించారు.

Also Read : వారెవ్వా ‘ష‌కీరా’ సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!