Sarkar Vaari Paata Trailer : స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ రిలీజ్

ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపిన డైరెక్ట‌ర్

Sarkar Vaari Paata  : ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన స‌ర్కారు వారి పాట ట్రైలర్ (Sarkar Vaari Paata )సోమ‌వారం రిలీజ్ అయ్యింది. హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లిలోని భ్ర‌మ‌రాంభ‌కి థియేట‌ర్ లో మూవీ ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

ఈనెల 12న విడుద‌ల చేసేందుకు మూవీ మేక‌ర్స్ ట్రై చేస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు. ఇటు తెలంగాణ‌లో అటు ఏపీలో రెండు చోట్ల స‌ర్కార్ వారి పాట ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఇదే స‌మ‌యంలో చిత్రానికి సంబంధించి వ‌రుసగా అప్ డేట్ ఇస్తూ మ‌రింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప్రిన్స్ మ‌హేష్ బాబును మ‌రింత అందంగా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు పరుశురామ్.

ఇప్ప‌టికే ఫిల్మ్ కు సంబంధించిన పోస్ట‌ర్లు, టీజ‌ర్ల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇక సినిమాలోని క‌ళావ‌తి, ఎవ్రీ పెన్నీ పాట‌లు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ రెండు పాట‌ల్ని గేయ ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్ రాశారు.

ఎస్. ఎస్. థ‌మ‌న్ స‌ర్కారు వారి పాట‌కు సంగీతం అందించారు. దీంతో ట్రైల‌ర్ ను చూసేందుకు మ‌హేష్ బాబు అభిమానులు బారులు తీరారు. ఎండ‌ను సైతం లెక్క చేయ‌కుండా చూసేందుకు ఎగ‌బ‌డ్డారు.

ఎక్క‌డ చూసినా సర్కార్ వారి పాట గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్ నిమిషాల్లోను మిలియ‌న్ వ్యూస్ దిశ‌గా దూసుకు పోతోంది.

ఇదిలా ఉండ‌గా ట్రైల‌ర్ అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా ఉండ‌డంతో ఫ్యాన్స్ ముచ్చ‌ట ప‌డుతున్నారు.

Also Read : 6న వ‌స్తున్నాం హిట్ కొడుతున్నాం

Leave A Reply

Your Email Id will not be published!