Sarpanch Navya : ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా

స‌ర్పంచ్ న‌వ్య షాకింగ్ కామెంట్స్

Sarpanch Navya : స్టేష‌న్ ఘ‌న్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన స‌ర్పంచ్ న‌వ్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం కేసీఆర్ త‌న‌కు అవ‌కాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించింది. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి అన్ని విధాలుగా అర్హురాలినేన‌ని స్ప‌ష్టం చేశారు.

Sarpanch Navya Comments Viral

స‌ర్పంచ్ న‌వ్య ఇటీవ‌ల తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. త‌న భ‌ర్త ఉండ‌గానే ఎమ్మెల్యే రాజ‌య్య(MLA Rajaiah) చిలిపి చేష్ట‌లు చేసేందుకు ప్ర‌య‌త్నం చేశాడ‌ని, మాన‌సికంగా, శారీర‌కంగా ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చోటు చేసుకుంది. చివ‌ర‌కు రాజీ చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేశారు ఎమ్మెల్యే రాజ‌య్య‌. అయినా స‌ర్పంచ్ న‌వ్య ఒప్పుకోలేదు. స‌ర్పంచ్ వ‌ర్సెస్ ఎమ్మెల్యే వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలి వాన‌గా మారింది. పార్టీకి ఎఫెక్ట్ ప‌డ‌డంతో హైక‌మాండ్ సీరియ‌స్ అయ్యింది.

స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌ను హైద‌రాబాద్ కు రావాల్సిందిగా ఆదేశించింది. ఆయ‌న హుటా హుటిన వెళ్లారు. మంత్రి కేటీఆర్ ను క‌లుసుకున్నారు. ఇదే స‌మ‌యంలో తాజాగా బీఆర్ఎస్ చీఫ్ , సీఎం కేసీఆర్ 119 సీట్ల‌కు గాను 115 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారుచేశారు.

స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి టికెట్ ఇచ్చేందుకు రాజయ్య‌కు నిరాక‌రించారు. ఆయ‌న స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రికి టికెట్ కేటాయించారు. ఈ త‌రుణంలో స‌ర్పంచ్ న‌వ్య చేసిన ప్ర‌క‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

Also Read : YS Jagan Vijay Sai CBI : జ‌గ‌న్..విజ‌య సాయికి సీబీఐ కోర్టు షాక్

Leave A Reply

Your Email Id will not be published!