TTD : తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్వ దర్శనం టికెట్లను (TTD)కొందరికే పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ఈనెల 10 నుంచి తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారం సర్వ దర్శనం టికెట్లను కేవలం తిరుపతి వాసులకే పరిమితం చేసినట్లు వెల్లడించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఇక్కడి వారికి మాత్రమే సర్వ దర్శన టోకెన్లను ఇస్తామని వేరే వారికి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. దీని కోసం తిరుపతిలోని ఐదు ప్రాంతాలలో టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఇవాళ ఆయా టోకెన్ల జారీ సెంటర్లను స్వయంగా పరిశీలించారు. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలిగి ఉన్నారు ఆ దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామికి. సర్వ దర్శనం కోసం భారీగా డిమాండ్ ఉంటోంది.
ఇదిలా ఉండగా ఈనెల 10న ఉదయం 9 గంటలకు తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్లను జారీ చేస్తామని స్పష్టం చేశారు కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డి.
ఇందులో భాగంగా ఐదు ప్రాంతాలైన మున్సిపల్ ఆఫీస్ , బైరాగి పట్టెడ రామానాయుడు పాఠశాల, సత్యనారాయణపురం జిల్లా పరిషత్ స్కూల్, ముత్యాల రెడ్డి పల్లె, రామచంద్ర పుష్కరిణి దగ్గర టోకెన్ల జారీకి కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు.
ఈనెల 13 నుంచి 22 వరకు రోజుకు 5 వేల చప్ఉన 50 వేల సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా టికెట్లు పొందిన వారు అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు(TTD) అనుమతి ఇస్తామని తెలిపారు ఈవో.
Also Read : గత చరిత్రకు దర్పణం బుద్ధవనం