Satya Nadella PM Modi : ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల భేటీ
అన్ని రకాలుగా సహాయం అందజేస్తాం
Satya Nadella PM Modi : మైక్రోసాఫ్ట్ సిఇఓ, చైర్మన్ సత్య నాదెళ్ల భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ తో ములాఖత్ అయ్యారు. గురువారం సత్య నాదెళ్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో(Satya Nadella PM Modi ) భేటీ అయ్యారు. కీలకమైన అంశాలపై చర్చించారు.
ప్రధానంగా భారత దేశంలో డిజిటల్ ఇండియా, టెక్నాలజీ డెవలప్ మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ సందర్బంగా ప్రధానితో కలిసిన విషయానికి సంబంధించి సమాచారాన్ని పంచుకున్నారు సత్య నాదెళ్ల. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ప్రధానితో భేటీ కావడం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. ప్రధానంగా దేశం గురించి సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండడాన్ని మోదీలో తాను చూశానని ప్రశంసించారు. డిజిటల్ ఇండియాగా మార్చాలన్న కోరిక ఆయనలో ఎక్కువగా ఉందన్నారు. ఇది తనను విస్తు పోయేలా చేసిందని స్పష్టం చేశారు సత్య నాదెళ్ల.
ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ పరంగా భారత దేశానికి ఎలాంటి సహాయం చేసేందుకైనా తాము సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు మైక్రోసాఫ్ట్ సిఇఓ, చైర్మన్. ముఖ్యంగా సాంకేతికత, ఆర్థిక వృద్ది, సాధికారత, మహిళా అభివృద్ది, డిజిటల్ టెక్నాలజీ గురించి చర్చకు వచ్చిందని తెలిపారు. డిజిటల్ అభివృద్దికి పూర్తి సహాయ సహకారం అందజేస్తామని వెల్లడించారు సత్య నాదెళ్ల(Satya Nadella) .
ఇక నరేంద్ర దామోదర దాస్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ , మైక్రోసాఫ్ట్ సిఇఓ , చైర్మన్ సత్య నాదెళ్లకు పద్మశ్రీ పురస్కారం అందజేసింది.
Also Read : అమెజాన్ దెబ్బ మామూలుగా లేదబ్బా