Satya Pal Malik : జమ్మూ, కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి భారతీయ జనతా పార్టీపై, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. గత కొంత కాలం నుంచీ ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ వచ్చారు. ఆయన గవర్నర్ గా ఉన్న సమయంలోనే రైతుల ఆందోళనకు మద్దతు పలికారు.
అంతే కాదు రైతులను ఇబ్బంది పెట్టడం వల్ల పార్టీకి మనుగడ ఉండదని హెచ్చరించారు. మీరు చేస్తున్నది ముమ్మాటికీ తప్పేనని ప్రధాన మంత్రిని నిలదీశారు. ఒక రకంగా ప్రశ్నలతో కడిగి పారేశారు.
తాను అత్యంత సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నానని, తనకు ఎలాంటి ఆస్తులు , అంతస్తులు లేవన్నారు. ప్రజల కోసం వారి గొంతుకను వినిపిస్తానని చెప్పారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలు ఈ దేశానికి ముఖ్యంగా 143 కోట్ల ప్రజలకు అత్యంత ముఖ్యమైనవని హెచ్చరించారు. ఎందుకంటే మనం కోరుకున్న ప్రజాస్వామ్యం ఇప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు సత్య పాల్ మాలిక్(Satya Pal Malik).
తాను ఉత్తర ప్రదేశ్ లో జయంత్ చౌదరి తరపున ప్రచార కర్తగా ఉంటానని అన్నారు. హర్యానాలో భూపేంద్ర సింహ హూడా కు మద్దతుగా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు మాజీ గవర్నర్. రాజస్థాన్ లో కూడా బీజేపీని ఓడించే వ్యక్తుల తరపున పాల్గొంటానని కుండ బద్దలు కొట్టారు.
Also Read : Korea Ambassador : సిద్దరామయ్యతో కొరియా రాయబారి భేటీ