Satyavathi Rathod : సార్ చల్లంగా ఉండాలి – సత్యవతి
కేసీఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రి
Satyavathi Rathod : హైదరాబాద్ – కేసీఆర్ సారు చల్లంగా ఉండాలని అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod). పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని త్వరలోనే కోలుకుని తమ వద్దకు వస్తారని చెప్పారు.
Satyavathi Rathod Met KCR
ఇదిలా ఉండగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జారి పడడంతో కేసీఆర్ తుంటి విరిగింది. పడి పోయిన ఆయనను హుటా హుటిన హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేపట్టారు.
తుంటి విరిగిందని శస్త్ర చికిత్స చేయాలని స్పష్టం చేశారు. అయితే ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు కల్వకుంట్ల కుటుంబం. పరీక్షలు చేసిన అనంతరం కేసీఆర్ కు ఆపరేషన్ చేయడం, అది పూర్తిగా సక్సెస్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం ఆయన నడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తను కోలుకుని , తిరిగి యధావిధిగా నడిచేందుకు కొంత సమయం పడుతుందని , ఆ మేరకు ఆరు వారాలైనా విశ్రాంతి కావాలని యశోద యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో తమ పార్టీకి చెందిన వారే కాకుండా సీనీ, క్రీడా రంగాలకు చెందిన వారు కూడా కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు.
Also Read : Chandra Shekar Azad : కేసీఆర్ కు పరామర్శల పరంపర