Saudi Crown Prince : విదేశీ పర్యటనలో సౌదీ యువరాజు
జర్నలిస్ట్ హత్య ఆరోపణల తర్వాత
Saudi Crown Prince : ప్రపంచ వ్యాప్తంగా మరోసారి వార్తల్లో నిలిచారు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్(Saudi Crown Prince). ఇటీవలే అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ సౌదీని సందర్శించారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ ఖషోగ్గీ హత్య కేసు మరోసారి ప్రస్తావనకు వచ్చింది. దీని వెనుక యువరాజు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖషోగ్గీ ప్రియురాలు తీవ్రంగా తప్పు పట్టింది బైడెన్ పర్యటనను.
రక్తంతో తడిసిన చేతులతో ఎలా కరచాలనం చేస్తారంటూ ప్రశ్నించారు. తీవ్ర దుమారం రేగింది. ఇదే సమయంలో బైడెన్ , యువరాజు కలిసి పాల్గొన్న ఇంటర్నేషనల్ మీడియా లో ఏకంగా ప్రశ్నల వర్షం కురిసింది ఖషోగ్గీ హత్యోదంతంపై.
దీనిపై ఎలాంటి స్పందన రాలేదు యువరాజు నుంచి. కానీ నర్మ గర్భంగా నవ్వారంతే. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. నవ్వడం అంటే హత్య చేయించినట్లు భావించాల్సి వస్తుందంటూ కామెంట్స్ కూడా వచ్చాయి.
ఇదే సమయంలో సౌదీలో ఇంటెలిజెన్స్ (నిఘా) విభాగంలో పని చేసి పారిపోయి ప్రస్తుతం కెనడాలో ఉంటున్న ఓ మాజీ అధికారి సంచలన ఆరోపణలు చేశారు యువరాజుపై.
శాడిస్టు, నరహంతకుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే సమయంలో బైడెన్ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకునేలా చేసింది. బైడెన్ టూర్ ముగిశాక యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు.
గురువారం జూలై 28న ఆయన ఫ్రాన్స్ లో పర్యటిస్తన్నారు. ఆ దేశ అధ్యక్షుడితో భేటీ కానున్నారు. నాలుగు సంవత్సరాల తర్వాత పశ్చిమ దేశాలలో తన మొదటి పర్యటనకు శ్రీకారం చుట్టారు.
బుధవారం చేరుకున్న యువరాజుకు గ్రీస్, ఫ్రాన్స్ ఘన స్వాగతం పలికింది.
Also Read : తగ్గేదే లే అంటున్న డొనాల్డ్ ట్రంప్