Saudi Prince Stays : అత్యంత ఖరీదైన భవనంలో సౌదీ ప్రిన్స్ బస
విలాస వంతమైన భవంతిగా చరిత్రలో చోటు
Saudi Prince Stays : సౌదీ అరేబియా యువ రాజు గా పేరొందిన ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ చాలా గ్యాప్ తర్వాత విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం యువ రాజు పారిస్(Saudi Prince Stays) లో పర్యటిస్తున్నారు.
ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనంలో యువ రాజు ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ బస చేశారు.
ప్యారిస్ వెలుపల లూవెసియెన్నెస్ లోని చాటే లూయిస్ లో కొలువు తీరింది ఈ అద్భుత, ఖరీదైన అందమైన భవనం. ఫ్రాన్స్ లో వ్యాపారాలను నిర్వహిస్తున్న జమాల్ ఖషోగ్గీ బంధువు ఎమాద్ ఖషోగ్గీ దీనిని నిర్మించారు.
వరల్డ్ లోనే ఈ రాజ భవనం అత్యంత ఖరీదైనదిగా పేరొందింది. ఈ భవంతిలో నైట్ క్లబ్ , బంగారు ఆకులతో కూడిన ఫౌంటెన్ , సినిమా, నీటి అడుగు భాగాన గాజు గదిని ఏర్పాటు చేశారు.
ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ను కలిసిన తర్వాత సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2015లో కోట్లాది రూపాలయతో నిర్మించిన భవంతిలో బస చేశారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యువరాజు బస చేసిన భవంతి గురించి చర్చ మొదలైంది. ఈ చాటేయు లూయిస్ XIV భవనం ఒకప్పుడు ఫ్రెంచ్ రాజ కుటుంబానికి స్థానంగా ఉండింది.
కాగా ఈ ఖరీదైన భవనం 7,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. 275 మిలియన్ యూరోలకు 2015లో కొనుగోలు చేశాడు.
అప్పట్లో దాని విలువ $300 మిలియన్లు. ప్రముఖ ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఈ భవనాన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా పేర్కొంది.
Also Read : అస్సాంలో ఉగ్రవాదుల పట్టివేత
Is it available for VVIP only or for all ?