Rahul Gandhi Savarkar : సావర్కర్ దేశ ద్రోహి..రాహుల్ పై కేసు
మహారాష్ట్రలో హిందూ శ్రేణుల ఆందోళన
Rahul Gandhi Savarkar : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై పోలీస్ కేసు నమోదైంది. స్వాతంత్రానికి ముందు బ్రిటీష్ వారికి క్షమాపణ లేఖపై సంతకం చేసి మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకులకు సావర్కర్ ద్రోహం(Rahul Gandhi Savarkar) చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది.
గాంధీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు మహా వికాస్ అఘాడీ అధినేత్రి బాలాసాహెబంచి. మహారాష్ట్ర గడ్డపై మహానుభావుల పరువు తీస్తే సహించమని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో స్థానికుల మనోభావాలు దెబ్బ తిన్నాయని పేర్కొంటూ థానే నగర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలైంది.
ఐపీసీ సెక్షన్ 500, 501 కింద నాన్ కాగ్నిజబుల్ (ఎన్సీఆర్) నేరం కేసు నమోదు చేశారు. యాత్రలో భాగంగా మహారాష్ట్ర లోని అకోలాలో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తాను లేనిపోని ఆరోపణలు చేయడం లేదని, ఆధారాలు ఉన్నాయని, అందుకే చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
సావర్కర్ బ్రిటీష్ వారికి మన్నించమంటూ వేడుకొంటూ రాసిన లేఖను ఈ సందర్భంగా మీడియా సాక్షిగా చూపించారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ తో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ , భజరంగ్ దళ్ లాంటి సంస్థలు భగ్గుమన్నాయి.
మరో వైపు శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్ర అభ్యంతరం తెలిపారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై.
Also Read : బెంగాల్ గవర్నర్ గా సీవీ ఆనంద బోస్