Rahul Gandhi Savarkar : ఆంగ్లేయుల‌కు సాయం చేసిన సావ‌ర్క‌ర్

ఆధారాలు ఉన్నాయ‌న్న రాహుల్ గాంధీ

Rahul Gandhi Savarkar : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌హారాష్ట్ర‌లో ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్బంగా గురువారం మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .

ఓ వైపు ల‌క్ష‌లాది మంది దేశ స్వాతంత్రం కోసం ఆంగ్లేయుల‌తో పోరాడుతుంటే రాష్ట్రీయ స్వ‌యం సంఘ్ ,బీజేపీ, విశ్వ హిందూ ప‌రిషత్, భ‌జ‌రంగ్ ద‌ళ్ కు చెందిన శ్రేణులు వీర సావ‌ర్క‌ర్(Vinayak Damodar Savarkar) ను కీర్తిస్తుంటాయ‌ని ఎద్దేవా చేశారు. కానీ ఆనాడు దేశానికి వ్య‌తిరేకంగా ఆంగ్లేయుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

వీర సావ‌ర్క‌ర్ బ్రిటీష్ వారికి స‌హాయం చేశాడ‌ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని చెప్పారు రాహుల్ గాంధీ. ఇదిగో ఆయ‌న రాసిన లేఖ అంటూ మీడియా ముందు ప్ర‌ద‌ర్శించారు. మహారాష్ట్ర లోని బుల్దానా జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యాత్ర చేప‌ట్టిన సంద‌ర్భంగా మాట్లాడారు.

అంత‌కు ముందు ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ(Rahul Gandhi ) లేవనెత్తిన ఈ అంశం , చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌ని రాహుల్ గాంధీ ఉన్న‌ట్టుండి ఏకంగా ఆర్ఎస్ఎస్ భావ‌జాలం, శ్రేణుల‌ను నిందించ‌డం పార్టీ శ్రేణుల‌ను విస్తు పోయేలా చేసింది.

ఆయ‌న పెద్ద ఎత్తున కేంద్ర స‌ర్కార్ ను టార్గెట్ చేశారు. అగ్ని వీర్ పేరుతో దేశంలో ఉన్న యువ‌తీ యువ‌కుల‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మోసం చేశారంటూ ఆరోపించారు.

Also Read : అగ్నివీర్ పేరుతో కేంద్రం మోసం – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!