Supreme Court Relief : ప‌వ‌న్ ఖేరాకు ‘సుప్రీం’ ఊర‌ట

మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు

SC Bail Pawan Khera : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ప‌వ‌న్ ఖేరాకు ఊర‌ట ల‌భించింది. ఈ మేర‌కు భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు గురువారం మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని(PM Modi) అవ‌మానించార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఛ‌తీస్ గ‌ఢ్ రాజ‌ధాని రాయ్ పూర్ కు తీసుకు వెళ్లారు పోలీసులు. అక్క‌డి నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దింపారు. అక్క‌డే అస్సాం పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిర‌స‌న వ్య‌క్తం చేసింది. ఆందోళ‌న చేప‌ట్టింది. అరెస్ట్ చేసిన కొన్ని గంట‌ల‌కే కాంగ్రెస్ పార్టీ వెంట‌నే బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. ఈ సంద‌ర్భంగా విచారించిన కోర్టు(SC Bail Pawan Khera) మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో అస్సాం పోలీసుల‌కు బిగ్ షాక్ త‌గిలింది.

ఈ సంద‌ర్భంగా భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ , అస్సాంల‌లో న‌మోదైన కేసుల‌పై కాంగ్రెస్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను విచార‌ణ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా సీజేఐ మాట్లాడారు. మాట్లాడేముందు కొంచెం ఆలోచించుకుని మాట్లాడాల‌ని సూచించారు. పీవీ , వాజ్ పేయ్ జాయింట్ పార్ల‌మెంటరీ క‌మిటీలు ఏర్పాటు చేశారు. కానీ మోదీకి ఏమైందంటూ ప్ర‌శ్నించారు ప‌వ‌న్ ఖేరా(Pawan Khera).

స్లిప్ ఆఫ్ టంగ్ అని కాంగ్రెస్ వాదించింది. ఈ సంద‌ర్బంగా ఖేరా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆయ‌న‌పై ఉన్న అన్ని ఎఫ్ఐఆర్ ల‌ను జ‌త చేయాల‌న్న పార్టీ కోరిక‌ను కోర్టు అంగీక‌రించింది.

Also Read : ఫ్లైట్ నుంచి దింప‌డం చిల్ల‌ర చ‌ర్య – సీఎం

Leave A Reply

Your Email Id will not be published!