SCR Special Trains : దసరా పండుగ కోసం ప్రత్యేక రైళ్లు
కిటకిట లాడుతున్న రైల్వే స్టేషన్లు
SCR Special Trains : దసరా పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిటకిట లాడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఆధ్వర్యంలో ప్రత్యేక రైళ్లు(SCR Special Trains) నడుపుతోంది. 02764 నెంబర్ కలిగిన రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుంది. అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 2న 02763 నెంబర్ కలిగిన ట్రైను సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయలు దేరుతుంది. అక్టోబర్ 3న ఉదయం 5.45 గంటలకు సికిందాబాద్ కు చేరుకుంటుంది.
ఈ స్పెషల్ ట్రైన్ జనగామ, కాజిపేట, వరంగల్ , డోర్నకల్ , ఖమ్మం, విజయవాడ , తెనాలి, చీరాల, ఒంగోలు, గూడురు , రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
07233 నంబర్ కలిగిన రైలు సికింద్రాబాద్ నుంచి యశ్వంత్ పూర్ కు వెళుతుంది. అక్టోబర్ 6, 13, 20 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి రాత్రి 9.45 కి బయలు దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు యశ్వంత్ పూర్ కు చేరుకుంటుంది. 07234 నంబర్ కలిగిన రైలు ఈనెల 30న, అక్టోబర్ 7, 14, 21 తేదీలలో యశ్వంత్ పూర్ లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలు దేరుతుంది. తెల్లారి సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.
07467 నెంబర్ కలిగిన ట్రైను సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ మధ్యన నడుస్తుంది. అక్టోబర్ 1న రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్ లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్ స్టేషన్ కు చేరుతుంది. అన్ని రైల్వే స్టేషన్లన్నీ ప్రయాణీకులతో రద్దీగా ఉన్నాయి. ముందస్తుగా టికెట్లు బుకింగ్ చేసుకోని వాళ్లు నానా తంటాలు పడుతున్నారు.
Also Read : వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం