SCR Vijayawada Trains : విజయవాడ రూట్ లో పలు రైళ్లు రద్దు
ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే శాఖ
SCR Vijayawada Trains : విజయవాడ – భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల రాక పోకలను తాత్కాలికంగా రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లింపు చేసినట్లు స్పష్టం చేసింది దక్షిణ మధ్య రైల్వే(SCR) . నేటి నుంచి 12వ తేదీ వరకు గుంటూరు – విశాఖ (రైలు నెం.17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు తెలిపింది. రాజమండ్రి – విశాఖ (రైలు నెం.07466) మెమూ, విశాఖ – రాజమండ్రి (రైలు నెం.07467) మెమూ వరకు నడిచే రైళ్లు కూడా నడవవని పేర్కొంది.
SCR Vijayawada Trains Updates
అదే విధంగా 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖ – గుంటూరు (రైలు నెం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను కూడా రద్దు చేసినట్లు తెలిపింది. కాకినాడ పోర్టు – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17267), విశాఖపట్నం – కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ (17268), రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12717,12718) – విజయవాడ, విశాఖపట్నం మధ్య, గుంటూరు – రాయగఢ్ ఎక్స్‌ప్రెస్ (17243), మచిలీపట్నం – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17219) రైళ్నను 12 వరకు రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
ఇక విశాఖపట్నం – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17220), రాయగడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244) రైళ్ళను 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రద్దు చేశారు.
Also Read : BRS Win Again : తెలంగాణలో గులాబీదే జోరు