ED Raids WB Scam : పార్థ..అర్పితకు చెందిన ఫ్లాట్ లో సోదాలు
మరోసారి దాడులు చేపట్టిన ఈడీ
ED Raids WB Scam : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సహాయకురాలు అర్పిత ముఖర్జీని ఈడీ అరెస్ట్ చేసింది.
ఇందులో భాగంగా రూ. 50 కోట్ల నగదు, 5 కేజీల బంగారం బయట పడింది. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిన్నటి వరకు తాను ఒక్క పైసా ముట్టుకోనని, అవినీతి, అక్రమాలకు పాల్పడితే సహించనంటూ చిలుక పలుకులు పలికిన టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది.
దీంతో పార్థ చట్టర్జీ నిర్వాకం తమ మెడకు చుట్టుకుంటుందని భావించిన దీదీ అతడిపై వేటు వేసింది. ఆపై తాజాగా క్యాబినెట్ ను విస్తరించింది. అందులో ఐదుగురికి చోటు కల్పించింది.
వారిలో బీజేపీలో ఉంటూ కేంద్ర మంత్రిగా, ఎంపీ పదవికి రాజీనామా చేసిన బాబుల్ సుప్రియో కూడా ఉన్నారు. కాగా పార్థ ఛటర్జీ వ్యవహారంలో
అర్పిత ముఖర్జీ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది.
పూర్తి నిర్ధారణకు కూడా వచ్చింది. బెంగాల్ లో జరిగిన టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాం లో మంత్రిని అరెస్ట్ చేసింది. ఆపై విచారణలో ఆ మొత్తం
డబ్బు, బంగారం అంతా మంత్రిదేనంటూ అర్పిత ముఖర్జీ చెప్పడంతో ఇప్పుడు టీఎంసీ డైలమాలో పడింది.
ఇక ఆగస్టు 3న పార్థ, అర్పితకు చెందినదిగా భావిస్తున్న కోల్ కతాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాంతినికేతన్ ఫామ్ హౌస్ ను తనిఖీ చేసింది
ఈడీ. దీనిని 2012లో రూ. 20 లక్షలకు కొనుగోలు చేశారు మంత్రి(ED Raids WB Scam).
2020న అర్పిత ముఖర్జీపై మ్యుటేషన్ చేశాడు మంత్రి. తాజాగా గురువారం అర్పిత కు చెందిన మరో ఇంటికి తాళం ఉండడం చూసి దానిని
తెరిపించి సోదాలు చేపట్టింది. ఇంకా దీనికి సంబంధించి ఎంత డబ్బు దొరికిందనే దానిపై వివరాలు రావాల్సి ఉంది.
Also Read : మల్లికార్జున్ ఖర్గేకు ఈడీ సమన్లు