Delhi Liquor Scam ED : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్

అనుబంధ ఛార్జ్ షీట్ లో ఈడీ స్ప‌ష్టం

Delhi Liquor Scam ED : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన ఢిల్లీ లిక్క‌ర్ ఎక్సైజ్ పాల‌సీ కేసులో ముగ్గురు వ్య‌క్తుల‌తో పాటు ఐదు సంబంధిత సంస్థ‌ల పేర్ల‌తో రూస్ అవెన్యూ కోర్టులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్(Delhi Liquor Scam ED) గురువారం త‌న రెండ‌వ అనుబంధ ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసింది. వీరిలో రాఘవ్ మాగుంట‌, రాజేష్ జోషి, గౌత‌మ్ మ‌ల్హోత్రాతో పాటు 5 సంస్థ‌ల పేర్ల‌ను ప్ర‌స్తావించింది. ఈ విష‌యాన్ని ఈడీ స్పెష‌ల్ ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ న‌వీన్ కుమార్ మ‌ట్టా కోర్టుకు తెలిపారు. ఇదే కేసుకు సంబంధించి తొలి అనుబంధ ఛార్జ్ షీట్ లో 12 మంది నిందితులుగా ఉన్నారు.

ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫ‌ర్మేష‌న్ రిపోర్ట్ (ఇసిఐఆర్) వివిధ ఆరోప‌ణ‌ల‌పై నిందితులు, ఇత‌ర వ్య‌క్తుల పాత్ర‌పై ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపింది. అంత‌కు ముందు మొద‌టి అనుబంధ ఛార్జిషీట్ లో విజ‌య్ నాయ‌ర్ , శ‌ర‌త్ రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయిన‌ప‌ల్లి, అమిత్ అరోరాతో పాటు ఏడు కంపెనీలు ఉన్నాయి. 12 మంది నిందితులుగా ఉన్నారు. స‌మీర్ మ‌హేంద్రు , అత‌డి సంబంధిత సంస్థ‌ల‌పై ఈడీ మొద‌టి ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది.

ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, వ్యాపార‌వేత్త అమ‌న్ దీప్ సింగ్ ధాల్ పై ఈడీ ఇంకా ఛార్జిషీట్ దాఖ‌లు చేయ‌లేదు.

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, వ్యాపారవేత్త అమన్‌దీప్ సింగ్ ధాల్‌పై ఈడీ ఇంకా చార్జిషీట్ దాఖలు చేయలేదు. గౌత‌మ్ మ‌ల్హోత్రా పంజాబ్ కు చెందిన వ్యాపార‌వేత్త‌. మాజీ రాఘ‌వ్ మాగుంట వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి త‌న‌యుడు. రాజేష్ జోషి చారియ‌ట్ ప్రొడ‌క్ష‌న్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ య‌జ‌మాని. జోషి 2022లో గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల సమ‌యంలో ఆప్ ప్ర‌చారాన్ని న‌డిపిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

Also Read : మ‌రాఠా పాతాళంలా న‌డుస్తోంది – రౌత్

Leave A Reply

Your Email Id will not be published!