K Vijay Kumar : భ‌ద్ర‌తా స‌ల‌హాదారు విజ‌య్ కుమార్ గుడ్ బై

కేంద్ర ప్ర‌భుత్వానికి కోలుకోలేని షాక్

K Vijay Kumar : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వానికి కోలుకోలేని షాక్ త‌గిలింది. దేశంలోనే మోస్ట్ పాపుల‌ర్ పోలీసు ఆఫీస‌ర్ గా పేరొందిన త‌మిళ‌నాడుకు చెందిన కె. విజ‌య్ కుమార్(K Vijay Kumar) కీల‌క ప‌ద‌వికి గుడ్ బై చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు హోం మంత్రిత్వ శాఖకు భ‌ద్ర‌తా సల‌హాదారుగా ఉన్నారు.

తాను ఇక ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌లేనంటూ స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రికి, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు సుదీర్ఘ లేఖ రాశారు.

ఇదిలా ఉండ‌గా కె. విజ‌య్ కుమార్ ఎక్కువ‌గా జ‌మ్మూ కాశ్మీర్ తో పాటు వామ‌ప‌క్ష తీవ్ర‌వాదం (ఎల్ డ‌బ్ల్యూ ఈ ) స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వానికి స‌ల‌హా ఇస్తూ వ‌చ్చారు ఇప్ప‌టి వ‌ర‌కు. ఫారెస్ట్ బ్రిగేండ్ వీర‌ప్ప‌న్ ను అంత‌మొందించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు కె. విజ‌య్ కుమార్. దేశ వ్యాప్తంగా ఆయ‌న గుర్తింపు పొందారు.

దీంతో కేంద్ర ప్ర‌భుత్వం కె. విజ‌య్ కుమార్(K Vijay Kumar) ను ఏరికోరి కేంద్ర భ‌ద్ర‌తా స‌ల‌హాదారుగా ఏరి కోరి ఎంపిక చేసింది. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొంత కాలం కింద‌ట తాను ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. ఢిల్లీలోని త‌న వ‌స‌తిని ఖాళీ చేసి చెన్నైకి మ‌కాం మార్చారు.

ఇందులో ఎలాంటి అనుమానం లేద‌ని, కేవ‌లం వ్య‌క్తిగ‌త ఇబ్బందుల వ‌ల్ల‌నే తాను త‌ప్పుకున్నాన‌ని స్ప‌ష్టం చేశారు కె. విజ‌య్ కుమార్. తాను ప‌ద‌విలో ఉన్నంత వ‌ర‌కు త‌న‌కు స‌హ‌క‌రించిన పీఎం మోదీకి, హోం శాఖ మంత్రి అమిత్ షా కు, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవ‌ల్ , ఎంహెచ్ఎ ఉన్నతాధికారులు, అన్ని రాష్ట్రాల పోలీసు బ‌ల‌గాల చీఫ్ ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు కె. విజ‌య్ కుమార్.

Also Read : దొర ఇలాఖాలో బానిస‌ల‌కే పెద్ద‌పీట

Leave A Reply

Your Email Id will not be published!