Security Breanch : పార్లమెంట్ లో భద్రతా వైఫల్యం
గ్యాస్ వదిలిన ఆగంతకులు
Security Breanch : న్యూఢిల్లీ – పార్లమెంట్ లో ఆగంతకులు చొరబడ్డారు. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళనకు దారి తీసింది. పొగను వదిలారు. దీంతో భయంతో పరుగులు తీశారు ఎంపీలు. పూర్తిగా సెక్యూరిటీ లోపం వల్లనే ఇది జరిగిందని ఎంపీలు ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు స్పీకర్ ఓం బిర్లా. ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు.
Security Breanch in Lok Sabha
ఈ ఆగంతకులు ఎలా లోపలికి ప్రవేశించారనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశ రాజధాని నగరంలో పెద్ద ఎత్తున పోలీసులు, ఆర్మీ జవాన్లు , ఇంటెలిజెన్స్ ఖాకీలు విధులు నిర్వహిస్తుంటారు. అయినా వీరందరినీ కన్నుకప్పి ఎలా లోపలికి ప్రవేశించారనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.
ఆగంతకులు లోపలికి వచ్చిన సమయంలో లోక్ సభలో(Lok Sabha) జీరో అవర్ పై చర్చ జరుగుతోంది. ఇద్దరు లోపలికి ఎంటర్ అయ్యారు. ఇదిలా ఉండగా సందర్శకులు కూర్చునే గ్యాలరీకి వెళ్లారు. అక్కడి నుంచి చూస్తూ ఉండగానే లోపలికి దూకారు. గ్యాస్ ను వదిలారు. అంతా చూస్తూ ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ ఒక్కసారిగా పెల్లుబుకడంతో పొగంతా వ్యాపించింది. భయంతో ఎంపీలు పరుగులు తీశారు.
ఆగంతకులు పారి పోతుండగా పట్టుకునే ప్రయత్నం చేశారు మరికొందరు ఎంపీలు. మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా నివ్వెర పోయారు ప్రజా ప్రతినిధులు. తమకే రక్షణ లేక పోతే మోదీ దేశాన్ని ఎలా రక్షిస్తాడని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Also Read : Sunil Gavaskar : కపిల్ తో పాండ్యాను పోల్చితే ఎలా