Rahul Gandhi Security : రాహుల్ యాత్రలో భద్రతా వైఫల్యం
సెక్యూరిటీ కల్పించాలని కేంద్రానికి లేఖ
Rahul Gandhi Security : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భద్రతా వైఫల్యం నెలకొందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆయన ప్రజల కోసం యాత్ర చేపట్టారని, ఇంకా యాత్ర కొనసాగించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు 9 రాష్ట్రాలలో పూర్తి చేసుకుని ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఇక్కడ పోలీసులు భద్రతను(Rahul Gandhi Security) కల్పించ లేక పోయారంటూ ఆరోపించింది.
ఈ విషయంలో కేంద్ర హోం శాఖ సెక్యూరిటీ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీకి చెందిన అగ్ర నేత యాత్ర సందర్భంగా ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర సర్కాప్ పై ఉందని స్పష్టం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఖాకీలు పెరుగుతున్న జనాన్ని నియంత్రించడంలో పట్టించు కోలేదని వాపోయింది పార్టీ.
భారత్ జోడో యాత్రలో పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని తెలిపింది. రాహుల్ గాంధీకి సరైన రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు లేఖ రాసింది. ఇందుకు సంబంధించి పలుమార్లు తెలియ చేసినా కేంద్రం పట్టించు కోలేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం లేఖ రాసిన విషయం గురించి ఆయన వెల్లడించారు. ఇంకా రాహుల్ గాంధీ కాశ్మీర్ దాకా ప్రయాణం చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం వేలాది మంది రాహుల్ గాంధీని కలిసేందుకు ఎగబడుతున్నారని తెలిపారు. ఈ సమయంలో సెక్యూరిటీ అన్నది అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
Also Read : టీ షర్ట్ పై రాహుల్ కామెంట్స్