Nalini Sriharan : హంత‌కులుగా కాదు బాధితులుగా చూడండి

ఇక నుంచి కొత్త జీవితానికి మార్గం ఈ విడుద‌ల

Nalini Sriharan : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన మాజీ ప్ర‌ధాని దివంగ‌త రాజీవ్ గాంధీ దారుణ హ‌త్య వెనుక కీల‌క సూత్ర‌ధారిగా ఉన్న న‌ళినీ శ్రీ‌ధ‌ర‌న్ జీవిత ఖైదు నుంచి విడుద‌లైంది. ఆమెతో పాటు మ‌రో ఐదుగురిని విడుద‌ల చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

1991లో రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో దోషులుగా తేల్చింది కోర్టు. న‌ళినీ శ్రీ‌హ‌ర‌న్(Nalini Sriharan) జైలు నుంచి విడుద‌ల అయ్యాక మీడియాతో మాట్లాడారు. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌ను ఇన్నేళ్లుగా ఆద‌రించిన త‌మిళుల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు.

అంతే కాకుండా రాష్ట్రంలో కొలువు తీరిన డీఎంకే పార్టీ చీఫ్‌, రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ తో పాటు రాష్గ్ర గ‌వ‌ర్న‌ర్ , సుప్రీంకోర్టుకు తాను ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు న‌ళినీ శ్రీ‌ధ‌ర‌న్.

ఇది త‌న‌కు కొత్త జీవిత‌మ‌ని , తాను ప్ర‌జా జీవితంలో చేర‌డం లేద‌న్నారు. నా భ‌ర్త‌, కూతురుతో ఇది కొత్త జీవితం. నేను ప్ర‌జా జీవితంలోకి వెళ్లాల‌ని అనుకోవ‌డం లేద‌ని చెప్పారు. 30 ఏళ్ల‌కు పైగా అక్కున చేర్చుకున్నందుకు ఆనందంగా ఉంద‌న్నారు నళినీ శ్రీ‌హ‌ర‌న్.

సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణ‌యాన్ని త‌మిళులు స్వాగ‌తించారు. దోషులుగా తేలిన ఏడుగురు కేసు ప‌రిధి నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, జ‌న జీవ‌న స్ర‌వంతిలో క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. సుప్రీంకోర్టు నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించింది. మ‌మ్మ‌ల్ని హంత‌కులుగా కాకుండా బాధితులుగా చూడాల‌ని విన్న‌వించారు న‌ళిని శ్రీ‌హ‌ర‌న్(Nalini Sriharan). ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి.

Also Read : కొలిజియం వ్య‌వ‌స్థ స‌రైన‌దే – మాజీ సీజేఐ

Leave A Reply

Your Email Id will not be published!