Seediri Appalaraju : చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలి
మంత్రి సీదిరి అప్పలరాజు
Seediri Appalaraju : శ్రీకాకుళం – ఏపీ రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు. నిప్పు నాయుడు ఇక జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన తప్పించు కోలేడంటూ పేర్కొన్నారు.
Seediri Appalaraju Comments on Chandrababu Naidu
ఐటీ శాఖ అన్ని ఆధారాలతో షోకాజ్ నోటీసులు ఇచ్చిందని, దీనికి ఏం సమాధానం చెబుతారోనని ప్రజలు వేచి చూస్తున్నారని అన్నారు సీదిరి అప్పలరాజు(Seediri Appalaraju). చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇన్నాళ్ల పాటు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ స్టేలు తెచ్చుకుంటూ కాలం వెళ్ల దీస్తున్నాడని ధ్వజమెత్తారు మంత్రి. ఇలాంటి వ్యక్తిని మనం క్షమిస్తే రాష్ట్రం మనల్ని ఉపేక్షించదని పేర్కొన్నారు. తాత్కాలిక సెక్రటేరియట్ కటిన దానికి ఇన్ని వందల కోట్లు కమీషనా అని ప్రశ్నించారు సీదిరి అప్పలరాజు.
రాష్ట్రంలో అమరావతి, పోలవరం, ఇతర సంస్థలను చంద్రబాబు నాయుడు ఏటీఎంలుగా వాడుకున్నాడని ఆరోపించారు. చంద్రబాబు చెప్పడు..రామోజీ చూడడు.. రాధాకృష్ణకు వినపడదంటూ ఎద్దేవా చేశారు సీదిరి అప్పలరాజు. ప్రశ్నించని రామోజీ, రాధా కృష్ణ, టీవీ5 నాయుడులు కూడా నేరస్థులేనని పేర్కొన్నారు.
Also Read : TTD Board Members : టీటీడీ సభ్యుల ప్రమాణ స్వీకారం