Seethakka Minister : మినీ అంగన్ వాడీ టీచర్లకు శుభవార్త
రూ. 7,500 నుంచి రూ. 13,500 కు పెంపు
Seethakka Minister : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ సంచలన ప్రకటన చేసింది. అంగన్ వాడీలలో పని చేస్తున్న టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు మినీ అంగన్ వాడీ లలో టీచర్లుగా పని చేస్తున్న వారికి ఇప్పుడు ఇస్తున్న జీతం కంటే అదనంగా పెంచుతున్నట్లు స్పష్టం చేశారు రాష్ట్ర గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి దాసరి సీతక్క.
Seethakka Minister Good News
ఇవాళ ఆమె సచివాలయంలో నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మినీ అంగన్ వాడి టీచర్ల జీతం పెంపునకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం చేశారు. అంతే కాకుండా ప్రతి అంగన్ వాడి కేంద్రానికి ఒక హెల్పర్ ను కూడా కొత్తగా నియమించుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా ఇప్పటి వరకు ఉన్న మినీ అంగన్ వాడి కేంద్రాలన్ అంగన్ వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించారు దాసరి సీతక్క(Seethakka Minister). తన తొలి సంతకంతో రాష్ట్రంలో ఇప్పటి దాకా ఉన్న 3,989 మినీ అంగన్ వాడీలు పూర్తి అంగన్ వాడి కేంద్రాలుగా మారాయని తెలిపారు. ప్రతి కేంద్రానికి ఒకరి చొప్పున 3,989 మంది హెల్పర్లను నియమించు కోవచ్చని స్పష్టం చేశారు మంత్రి.
ఇదిలా ఉండగా మంత్రి చేసిన సంచలన ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాలలో పని చేస్తున్న టీచర్లు, ఇతర సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : CM Revanth Reddy : కొత్త వాహనాలు కొనుగోలు చేయం