Seethakka Minister : ములుగే నా కుటుంబం ప్ర‌పంచం

స్ప‌ష్టం చేసిన మంత్రి దాస‌రి సీత‌క్క

Seethakka Minister : ములుగు – రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి దాస‌రి సీత‌క్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం తొలిసారిగా త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ములుగు శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని సంద‌ర్శించింది. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున జ‌నం సీత‌క్క‌కు(Seethakka) సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్బంగా సీత‌క్క భావోద్వేగానికి లోన‌య్యారు.

Seethakka Minister

ఒక‌ప్పుడు న‌క్స‌లైట్ గా తుపాకీ ప‌ట్టిన నా చేతులు ఇవాళ మంత్రిగా సంత‌కం చేశాయ‌ని, ఇది కేవ‌లం డాక్ట‌ర్ బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో త‌న‌ను సొంత బిడ్డ కంటే ఎక్కువ‌గా ఆద‌రించిన కాంగ్రెస్ పార్టీకి, త‌న‌ను కుటుంబంలో స‌భ్యురాలిగా భావించే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌కు ఎల్ల‌ప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక త‌న సోద‌రుడు సీఎం రేవంత్ రెడ్డి స‌హ‌కారం మ‌రిచి పోలేన‌ని అన్నారు. ఇదిలా ఉండగా త‌న కుటుంబం , త‌న ప్రపంచం ములుగు అని మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఇక్క‌డి నుంచే పాల‌న కొన‌సాగిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ములుగును విడిచి ఉండ‌లేనంటూ ప్ర‌క‌టించారు మంత్రి సీత‌క్క‌.

Also Read : Chelluboina Venu : లావు త‌గ్గ‌డానికే లోకేష్ యాత్ర

Leave A Reply

Your Email Id will not be published!