Hrithik Roshan : హిందీ సినీ రంగంలో మోస్ట్ పాపులర్ హీరోగా పేరొందారు హృతిక్ రోషన్. ఇవాళ ఆయన పుట్టిన రోజు. వయసు 47 ఏళ్లు. సరిగ్గా ఇదే రోజు 1974 జనవరి 10న రాకేశ్ రోషన్ , పింకీ రోషన్ దంపతులకు జన్మించారు.
చూపులతోనే కాదు నటనతో మెస్మరైజ్ చేస్తూ వచ్చాడు. భార్య సుజానే, ఇద్దరు పిల్లలు. ఇప్పటి వరకు ఆరు ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకున్నారు.
భారత దేశంలో అత్యంత ఆకర్షణీయమైన నటుడిగా హృతిక్ రోషన్ (Hrithik Roshan)ను పేర్కొంది జాతీయ మీడియా.1980లో కొన్ని సినిమాల్లో బాల నటుడిగా నటించాడు.
తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన కహూ నా ప్యార్ హై సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఈ మూవీ 2000లో విడుదలైంది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.
ఉత్తమ నటుడిగానే కాకుండా ఉత్తమ డెబ్యూ అవార్డు పొందాడు. ఆ తర్వాత అదే ఏడాదిలో ఫిజా, మిషన్ కాశ్మీర్ లో నటించి మెప్పించాడు. 2001లో కభీ ఖుషీ కభీ గమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు హృతిక్ రోషన్(Hrithik Roshan ).
కొంత కాలం గ్యాప్ వచ్చింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన కోయీ మిల్ గయా పేరుతో 2003లో వచ్చిన సినిమాతో మరోసారి తన సత్తా చాటాడు. పలు అవార్డులు దక్కాయి. 2006లో క్రిష్ సినిమా వచ్చింది.
ఇది సీక్వెల్ గా వచ్చింది. ధూమ్ -2 చిత్రం దుమ్ము రేపింది. చారిత్రాత్మక చిత్రం జోధా అక్బర్ 2008లో వచ్చింది. ఈ సినిమాకు నాలుగో ఫిలిం ఫేర్ దక్కింది.
2010లో గుజారిష్ లో అంగవైకల్యం ఉన్న వాడిగా నటించి మెప్పించాడు. 2011లో జిందగీఈ నా మిలేగీ దుబారా , 2012లో అగ్ని పథ్ , 2013లో క్రిష్ -3 సినిమాలు చచేశాడు. అత్యంత ఎక్కువ వసూళ్లు సాధించిన మూవీస్ గా రికార్డు సృష్టించాయి.
Also Read : రణవీర్ సింగ్ బిగ్ పిక్చర్ సూపర్