#GarimaYadav : గ‌రిమా ఆత్మ‌విశ్వాసం ఎంద‌రికో ఆద‌ర్శం

మ‌నీ కంటే దేశ సేవే గొప్ప‌ది అంటున్న గ‌రిమా

Garima Yadav: అందాల పోటీల్లో అందరి లాగే గరిమా యాదవ్ పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న వారిని దాటుకుని విజేతగా నిలిచారు. కానీ వచ్చిన ప్రసంశలు ..ప్రచారం ..డబ్బులు ..ఇవేవీ ఆమెను ఆకట్టు కోలేక పోయాయి. తన లక్ష్యం ఐఏఎస్ కావాలని. కానీ మెయిన్స్ దాకా వ‌చ్చి ఆగి పోయింది . ఈ సమయంలో అందాల పోటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

తనను తాను ప్రూవ్ చేసుకుంది. విజేతగా గెలిచినా ఎందుకో ..తన మనసు అందుకు ఒప్పు కోలేదు . అంతా బ్యూటీ క్వీన్ గా పిలుస్తూ వుంటే ఆమె మాత్రం దేశం వైపు చూసింది. ఇదే సమయంలో ఇంకొందరైతే ఇదే పొజిషన్ తో ఉండి పోయే వారు .కానీ ఆమె తీసుకున్న నిర్ణయం ఎందరినో విస్మయానికి గురి చేసింది.

29 ఏళ్ళ వయసు ఉన్న గరిమా యాదవ్ ఏకంగా ఇండియన్ ఆర్మీని ఎంచుకున్నారు. ఇంకొకరైతే సైనిక రంగం అంటేనే జడుసుకుంటారు. 2017 లో ఆమె బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత దేశ స్థాయిలో సీడీఎస్ పరీక్ష రాసారు . అందులో పాసై భారతీయ సైన్యంలో చేరారు . మా వాళ్లకు నేను ఒక్కదానినే ఉన్నా. నా పరిమితులు ఏమిటో తెలుసు .

ఎన్నో ఇబ్బందులు ..కష్టాలను చవి చూసా. లైఫ్ లో కొన్ని స్వానుభవం లోకి వచ్చాయి . ఆర్మీ పాఠశాల లో చదివా. సెయింట్ స్టీఫెన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసారు . సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అయ్యా. అందులో ఎంపిక కాక పోయినా వెనక్కి తగ్గలేదు.

ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరో వైపు పార్ట్ టైమ్ గా జాబ్ చేశారు. ఈ సమయంలో అందాల పోటీ జరగడం, అక్కడ ఎంపిక కావడం తిరిగి ఇటలీలో జరిగే పోటీలకు నామినేట్ అయ్యారు. ఇండియా మిస్ చార్మింగ్ పేస్ గా గరిమా ఎంపికయ్యారు. ఎంతో పేరు తో పాటు కావాల్సినన్ని డబ్బులు వచ్చినా ఆమె కాదనుకున్నారు.

దేశం గర్వించే రీతిలో .. భారత దేశ సైన్యంలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు . అందులో పరీక్ష రాసి పాసై తనలో దేశభక్తి ఇంకా నిలిచే ఉందని చాటి చెప్పారు. సో, పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్ల‌లో ఎంజాయ్ చేస్తూ లైఫ్ ను ..టైం ను కోల్పోతున్న యువత గరిమా యాదవ్ (Garima Yadav)ను చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది కదూ.

No comment allowed please