Elon Musk : సెక్స్ కి దూరం ఆమెతో అఫైర్ అబద్దం
గూగుల్ కో ఫౌండర్ వైఫ్ పై మస్క్ కామెంట్
Elon Musk : టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్ మరోసారి సంచలన ప్రకటన చేశాడు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అబద్దమని పేర్కొన్నాడు. గూగుల్ కో ఫౌండర్ సెర్గీ బ్రిన్ భార్య నికోల్ షాన హనన్ తో తాను సంబంధం పెట్టుకున్నట్లు వస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాడు.
ఎందుకు తనపై ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. మరోసారి ఈ అఫైర్ పై స్పందించాడు ఎలోన్ మస్క్(Elon Musk) . గత కొన్నేళ్లుగా తాను సెక్స్ కి దూరంగా ఉన్నానని, అలాంటప్పుడు ఆమెతో తాను ఎలా సంబంధం పెట్టుకుంటానని ప్రశ్నించాడు.
ప్రస్తుతం మస్క్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాను యుగాలుగా సెక్స్ చేయలేదంటూ పేర్కొనడం ఆశ్చర్య పోయేలా చేసింది.
గూగుల్ కో ఫౌండర్ భార్య తో స్నేహం ఉన్న మాట వాస్తవమేనని స్పష్టం చేశాడు. మూడు సంవత్సరాలలో కేవలం మూడు సార్లు మాత్రమే కలుసుకున్నామని, కానీ ఎలాంటి టచ్ చేయలేదని పేర్కొన్నాడు.
తనకంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయని వాటిని నమ్ముతానని తెలిపాడు ఎలోన్ మస్క్. రెండు సార్లు మాత్రం ఇతరుల సమక్షంలో చూశానని అంతకు మించి తామిద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదన్నాడు.
మరో కీలకమైన వ్యాఖ్యలు చేశారు టెస్లా సిఇఓ, చైర్మన్(Elon Musk). అదేమిటంటే సెక్స్ లో పాల్గొనేంత తీరిక, ఓపిక తనకు లేదన్నాడు.
తాను తన కంపెనీకి సంబంధించిన వ్యవహారాలలో ఫుల్ బిజీగా ఉన్నానని ఈ సమయంలో దానిపై ఆసక్తి ఉండదన్నాడు. దీనిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు పలు రకాలుగా.
Also Read : గూగుల్ కో ఫౌండర్ భార్యతో సంబంధం అబద్దం