CM Yogi : షహీద్ ఎయిర్ పోర్ట్ ఫ్లైఓవర్ సిద్ధం – సీఎం
ప్రకటించిన యుపీ యోగి ఆదిత్యానాథ్
CM Yogi : యుపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక ప్రకటన చేశారు. త్వరలో రాబోయే మకర సంక్రాంతికి సంబంధించి శుభవార్త చెప్పారు. గురువారం సీఎం యోగి మీడియాతో మాట్లాడారు. లక్నో లోని షహీద్ పాత్ – ఎయిర్ పోర్ట్ ఫ్లై ఓవర్ పూ్ర్తయిందన్నారు. ఇందుకు సంబంధించి పండుగ వేళ శుభదినం అని, ఆరోజే ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు సీఎం.
దీని వల్ల ట్రాన్స్ – గోమతి ప్రాంతంలోని గోమతి నగర్ , ఇందిరా నగర్ , చిన్హౌట్ , ఇతర కాలనీల నివాసితులు వేగంగా ఎయిర్ పోర్టుకు చేరుకునేందుకు ఈ ఫ్లై ఓవర్ సహాయ పడుతుందని స్పష్టం చేశారు యోగి ఆదిత్యానాథ్(CM Yogi) . ఈ ప్రారోంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , పంచాయతీరాజ్ శాఖ మంత్రి జితిన్ ప్రసాద్ హాజరు కానున్నట్లు సమాచారం.
కాగా లక్నో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని షహీద్ పాత్ తో కలుపుతూ కీలకమైన ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది. దీనిని మకర సంక్రాంతి జనవరి 14న నివాసితులకు అంకితం చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi) . ట్రాఫిక్ కు ఇబ్బంది ఉండదు.
చాలా మంది వీవీఐపీలకు కూడా మార్గం సుగమం ఏర్పడుతుందన్నారు సీఎం. ఇక ఫిబ్రవరిలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి ముందు వస్తున్నందున ఇది మంచి పరిణామంగా సీఎం తెలిపారు.
జీఐఎస్ లో పాల్గొనేందుకు వచ్చే అతిథులు, పెట్టుబడిదారులు, వ్యాపార దిగ్గజాలు, కార్పొరేట్ ఉన్నతాధికారులు అవధ్ రోటరీ లేదా కాన్పూర్ రోడ్ లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలవుతుంది.
Also Read : వందే భారత్ పాతబడిన రైలు – దీదీ