MP A Raja : మనుస్మృతిలో శూద్రులకు అవమానం
డీఎంకే ఎంపీ రాజా షాకింగ్ కామెంట్స్
MP A Raja : డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఎంపీ ఎ. రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందువుగా ఉండే వరకు నువ్వు శూద్రుడివేనని పేర్కొన్నారు.
ఆపై మనుస్మృతి గురించి కూడా వ్యాఖ్యానించారు. మను స్మృతిలో శూద్రులను అవమానించారని ఆరోపించారు. సమానత్వం, విద్య, ఉద్యోగాలు, దేవాల్లాయలోకి ప్రవేశం వంటివి నిరాకరించారంటూ ధ్వజమెత్తారు.
ప్రస్తుతం ఆయన నీలగిరి నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. ఎ. రాజా(MP A Raja) చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా ఇతురులను ప్రసన్నం చేసుకునేందుకు ఒక వర్గంపై ద్వేషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందువుగా ఉండే వరకు నువ్వు శూద్రుడివి. శూద్రుడిగా ఉండే వరకు వేశ్య కొడుకువి. హిందువుగా ఉండే వరకు పంచమన్ (దళితుడు). హిందువుడా ఉండే వరకు అంటరానివాడివి అని ఎ. రాజా ఫైర్ అయ్యారు.
ద్రవిడర్ కజగం సమావేశంలో ఎంపీ ఎ. రాజా(MP A Raja) పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
మీలో ఎంత మంది వేశ్యల పిల్లలుగా ఉండాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. మీలో ఎంత మంది అంటరాని వారుగా ఉండాలని అనుకుంటున్నారు .
ఈ ప్రశ్నల గురించి మనం గొంతు విప్పితేనే అది విరుచుకు పడుతుంది. అదే సనాతన ధర్మం అన్నారు ఎ. రాజా. క్రిస్టియన్ , ముస్లిం లేదా పర్షియన్ కాక పోతే హిందువు అయి ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు మాజీ మంత్రి.
ఇంత క్రూరత్వాన్ని ఎదుర్కొనే దేశం మరేదైనా ఉందా అని విస్మయం.
Also Read : మా హయాంలోనే పాల ఉత్పత్తిలో టాప్